Breaking News

శ్రమించి గెలిచిన శ్రీకాంత్‌

Published on Thu, 01/22/2026 - 03:39

జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్, ప్రస్తుత భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ తొలి రౌండ్‌ అడ్డంకిని అధిగమించగా... హెచ్‌ఎస్‌ ప్రణయ్, కిరణ్‌ జార్జి, ఆయుశ్‌ శెట్టి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. 

ప్రపంచ 24వ ర్యాంకర్‌ కోకి వతనాబె (జపాన్‌)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 21–15, 21–23, 24–22తో గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నిర్ణాయక మూడో గేమ్‌లో 20–21 స్కోరు వద్ద శ్రీకాంత్‌ ఓటమి అంచుల్లో నిలిచాడు. 

అయితే సంయమనం కోల్పోకుండా ఆడిన శ్రీకాంత్‌ స్కోరును 21–21తో సమం చేశాడు. ఆ తర్వాత మళ్లీ స్కోరు 22–22తో సమమైంది. ఈ దశలో శ్రీకాంత్‌ వరుసగా రెండు పాయింట్లు గెలిచి 24–22తో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. 2017లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తర్వాత శ్రీకాంత్‌ మరో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించలేకపోయాడు. 

మరో మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 68 నిమిషాల్లో 21–13, 16–21, 21–14తో వాంగ్‌ జు వె (చైనీస్‌ తైపీ)పై గెలిచాడు. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ప్రణయ్‌ 19–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో, కిరణ్‌ జార్జి 17–21, 14–21తో మో జకి ఉబైదుల్లా (ఇండోనేసియా) చేతిలో, ఆయుశ్‌ శెట్టి 8–21, 13–21తో అల్వీ ఫర్హాన్‌ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. 

సింధు శుభారంభం 
మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత స్టార్‌ పీవీ సింధు, రైజింగ్‌ స్టార్‌ అన్‌మోల్‌ ఖరబ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకోగా... తన్వీ శర్మ, మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్‌ తొలి రౌండ్‌లోనే  నిష్క్రమించారు. తొలి రౌండ్‌లో సింధు 53 నిమిషాల్లో 22–20, 21–18తో మనామి సిజు (జపాన్‌)పై, అన్‌మోల్‌ 21–16, 21–17తో పాయ్‌ యి పో (చైనీస్‌ తైపీ)పై గెలుపొందారు. 

తన్వీ శర్మ 21–18, 18–21, 16–21తో టొమోకా మియజకి (జపాన్‌) చేతిలో, మాళవిక 21–23, 12–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో, ఆకర్షి 21–8, 20–22, 17–21తో జూలీ జేకబ్‌సన్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం పాలయ్యారు.  

రుత్విక జోడీ ఓటమి 
మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌)... తనీషా క్రాస్టో–ధ్రువ్‌ కపిల (భారత్‌) జోడీలు తొలి రౌండ్‌లోనే ఓడిపోయాయి. రుత్విక–రోహన్‌ ద్వయం 9–21, 20–22తో థోమ్‌ గికెల్‌–డెల్ఫిన్‌ డెల్‌ర్యూ (ఫ్రాన్స్‌) జంట చేతిలో... తనీషా–ధ్రువ్‌ జంట 23–21, 20–22, 6–21తో జూలియన్‌ మాయో–లీ పలెర్మో (ఫ్రాన్స్‌) ద్వయం చేతిలో ఓటమి చవిచూశాయి. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)