Breaking News

14 నెలల తర్వాత...

Published on Sat, 05/24/2025 - 02:13

కౌలాలంపూర్‌: ఎట్టకేలకు భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. మలేసియా ఓపెన్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో 32 ఏళ్ల శ్రీకాంత్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 24–22, 17–21, 22–20తో ప్రపంచ 18వ ర్యాంకర్‌ టోమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. 74 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన పోరులో శ్రీకాంత్‌ కీలకదశలో చెలరేగి తుది ఫలితాన్ని శాసించాడు. 

నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్‌ ఒకదశలో 7–11తో వెనుకబడ్డాడు. కానీ సంయమనం కోల్పోకుండా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన శ్రీకాంత్‌ 14–14తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత 16–14తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్‌ అదే జోరును కొనసాగించి 20–17తో విజయం అంచుల్లో నిలిచాడు. అయితే పొపోవ్‌ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేశాడు. కానీ శ్రీకాంత్‌ మరో అవకాశం ఇవ్వకుండా వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. 

2024 మార్చిలో స్విస్‌ ఓపెన్‌లో చివరిసారి శ్రీకాంత్‌ సెమీఫైనల్‌ చేరుకున్నాడు. ఆ తర్వాత శ్రీకాంత్‌ 14 అంతర్జాతీయ టోర్నీల్లో పోటీపడ్డా క్వార్టర్‌ ఫైనల్‌ దశను దాటి ముందుకెళ్లలేకపోయాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్‌ యుషి తనాకా (జపాన్‌)తో శ్రీకాంత్‌ తలపడతాడు. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్‌ కపిల (భారత్‌) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో తనీషా–ధ్రువ్‌ ద్వయం 22–24, 13–21తో జియాంగ్‌ జెన్‌ బాంగ్‌–వె యా జిన్‌ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది.   

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)