Breaking News

మూడో వన్డేలో కివీస్‌ చిత్తు.. వైట్‌వాష్‌ నుంచి తప్పించుకున్న శ్రీలంక

Published on Sat, 01/11/2025 - 14:02

ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌(Newzeland(తో జరిగిన మూడో వన్డేలో 140 పరుగుల తేడాతో శ్రీలంక(Srilanka) ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ వైట్‌​ వాష్‌ నుంచి లంక తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

శ్రీలంక బ్యాటర్లలో నిస్సాంక(66) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్‌ మెండిస్‌(54), లియాంగే(53), కమిందు ​మెండిస్‌(46) రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్‌ శాంట్నర్‌ రెండు, నాథన్‌​ స్మిత్‌, బ్రెస్‌వెల్‌ తలా వికెట్‌ సాధించారు.

నిప్పులు చెరిగిన లంకేయులు..
అనంతరం 291 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను లంక బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. అసితా ఫెర్నాండో, తీక్షణ, మలింగ దాటికి న్యూజిలాండ్‌ కేవలం 22 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆ సమయంలో మార్క్‌ చాప్‌మన్‌ కివీస్‌ను అదుకునే ప్రయత్నం చేశాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి చాప్‌మన్‌ మాత్రం బౌండరీలు బాదుతూ కివీస్‌ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. లంకేయులపై కౌంటర్‌ ఎటాక్‌ దిగిన చాప్‌మన్‌ ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.

దీంతో లక్ష్య చేధనలో బ్లాక్‌ క్యాప్స్‌ 150 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో చాప్‌మన్‌(81 బంతుల్లో 81, 10 ఫోర్లు, ఒక​ సిక్స్‌) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో అసితా ఫెర్నాండో,తీక్షణ, మలింగ తలా మూడు వికెట్లు సాధించారు. 

మూడు వికెట్లతో సత్తాచాటిన అసితా ఫెర్నాండోకు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇక తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన న్యూజిలాండ్‌ సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌ అసాంతం అద్బుత ప్రదర్శన కనబరిచిన మాట్‌ హెన్రీకి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. కాగా అంతకంటే ముందు కివీస్‌తో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో లంక​ కోల్పోయింది.  ఇక శ్రీలంక తమ తదుపరి సిరీస్‌లో ఆస్ట్రేలియాతో రెండు టెస్టులు ఆడనుంది.
చదవండి: రవీంద్ర జడేజా రిటైర్మెంట్..! హింట్‌ ఇచ్చిన స్టార్‌ ఆల్‌రౌండర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)