Breaking News

శ్రీలంక క్రికెటర్‌కు భారీ ఊరట.. మూడేళ్ల నిషేధం ఎత్తివేత!

Published on Thu, 12/12/2024 - 16:32

శ్రీలంక క్రికెటర్‌ నిరోషన్‌ డిక్‌విల్లా( Niroshan Dickwella)కు భారీ ఊరట లభించినట్లు తెలుస్తోంది. ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ(WADA) అతడికి క్లీన్‌చిట్‌ దక్కినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిక్‌విల్లాపై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని ఎత్తివేసినట్లు తెలుస్తోంది. శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌-2024 సందర్భంగా డిక్‌విల్లాపై డోపింగ్‌ ఆరోపణలు వచ్చాయి.

ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ తన ఆట తీరును మెరుగుపరచుకునేందుకు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు శ్రీలంక యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(SLADA)కు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో నిరోషన్‌ డిక్‌విల్లాకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు ఏ ఫార్మాట్‌లోనూ క్రికెట్‌ ఆడకుండా మూడేళ్లపాటు​ నిషేధం పడింది.

ఈ నేపథ్యంలో నిరోషన్‌ డిక్‌విల్లా వాడాను ఆశ్రయించగా.. అతడికి ఊరట లభించినట్లు డైలీ మిర్రర్‌ లంక పేర్కొంది. డిక్‌విల్లా నిషేధిత ప్రేరకాలు వాడలేదని.. అతడు తీసుకున్న పదార్థాలతో బ్యాటింగ్‌ ప్రదర్శన మెరుగుపడే అవకాశం లేదని లీగల్‌ టీమ్‌ ఆధారాలు సమర్పించినట్లు తెలిపింది. ఫలితంగా నిరోషన్‌ డిక్‌విల్లాపై నిషేధం ఎత్తివేయాల్సిందిగా వాడా ఆదేశించినట్లు పేర్కొంది.

కాగా 31 ఏళ్ల నిరోషన్‌ డిక్‌విల్లా 2014లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఈ వికెట్‌ కీపర్‌ ఇప్పటి వరకు 54 టెస్టులు, 55 వన్డేలు, 28 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 2757, 1604, 480 పరుగులు సాధించాడు. అయితే, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడన్న కారణంగా నిషేధం ఎదుర్కోవడం అతడికి అలవాటే.

కోవిడ్‌ సమయంలో 2021లో బయో బబుల్‌ నిబంధనలు అతిక్రమించినందుకు నిరోషన్‌ డిక్‌విల్లాపై ఏడాది పాటు సస్పెన్షన్‌ వేటు పడింది. అతడితో పాటు ధనుష్క గుణతిలక, కుశాల్‌ మెండిస్‌ కూడా ఇదే తప్పిదం కారణంగా నిషేధం ఎదుర్కొన్నారు. ఇక గతేడాది న్యూజిలాండ్‌తో టెస్టు సందర్భంగా నిరోషన్‌ డిక్‌విల్లా శ్రీలంక తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్‌కే అతడు పరిమితమయ్యాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)