చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆసియాలోనే తొలి జ‌ట్టుగా

Published on Tue, 09/10/2024 - 14:05

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో శ్రీలంక‌కు ఊర‌ట విజ‌యం ద‌క్కింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓట‌మి పాలై సిరీస్ కోల్పోయిన శ్రీలంక‌.. నామ‌మాత్ర‌పు మూడో టెస్టులో మాత్రం జూలు విధిల్చింది. లండన్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను లంక చిత్తు చేసింది. 

దీంతో వైట్‌వాష్ నుంచి లంకేయులు త‌ప్పించుకున్నారు. 219 పరుగుల విజయ లక్ష్యాన్ని లంక‌ 40.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ పాథుమ్ నిసాంక(127) ఆజేయ సెంచ‌రీతో చెల‌రేగాడు. అత‌డితో పాటు కుశాల్‌ మెండిస్‌ (39 నాటౌట్‌), ఏంజెలో మాథ్యూస్ (32) రాణించారు.

లంక అరుదైన రికార్డు.. 
ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన శ్రీలంక ఓ అరుదైన రికార్డును త‌మ పేరిట లిఖించుకుంది. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై టెస్టుల్లో అత్య‌ధిక టార్గెట్‌ను ఛేదించిన తొలి ఆసియా జ‌ట్టుగా శ్రీలంక చ‌రిత్ర సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. 

2010లో ఆస్ట్రేలియాపై 180 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేజ్ చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో పాక్ ఆల్‌టైమ్ రికార్డును లంక బ్రేక్ చేసింది. ఈ జాబితాలో పాక్ తర్వాత టీమిండియా ఉంది. 1971లో ఇంగ్లండ్‌పై 173 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.
చదవండి: IND vs AUS: ముషీర్‌ ఖాన్‌కు బీసీసీఐ బంపరాఫర్‌.. టీమిండియాలో చోటు?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)