Breaking News

మార్క్‌రమ్‌కు నో ఛాన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ లిస్ట్ ఇదే!

Published on Wed, 10/09/2024 - 08:56

ఐపీఎల్‌-2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్ష‌న్ రూల్స్‌ను బీసీసీఐ ఖారారు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈసారి ఐపీఎల్ ఫ్రాంచైజీల‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. మెగా వేలానికి ముందు మొత్తం ఆరుగురు ఆట‌గాళ్ల‌ను అంటిపెట్టుకునే అవ‌కాశాన్ని ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ క‌ల్పించింది.

ఇందులో ఒక రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. అంతేకాకుండా  ప్ర‌తీ ఫ్రాంచైజీ ప‌ర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచారు. గతంలో ఈ పర్స్‌ విలువ రూ.90 కోట్లు ఉండేది. అయిదుగురి కోసం ఓ ఫ్రాంఛైజీ రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు ఫ్రాంఛైజీ చెల్లించాల్సి ఉంటుంది. 

నాలుగు, ఐదో ఆటగాడిని రిటైన్ చేసుకోవాల‌న‌కుంటే తిరిగి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాలి. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని మొత్తం 10 ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. ఈ క్ర‌మంలో ఆయా ఫ్రాంచైజీలు ఆయా ఫ్రాంచైజీలు త‌మ రిటెన్ష‌న్ జాబితాను దాదాపు ఫైనలైజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

మార్క్‌రమ్‌కు నో ఛాన్స్‌?
ఇక ఐపీఎల్‌-2024 సీజ‌న్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫ్రాంచైజీ తాము అంటిపెట్టుకునే ప్లేయ‌ర్ల లిస్ట్‌ను ఖారారు చేసిన‌ట్లు స‌మాచారం. రెండు సీజ‌న్ల‌లో త‌మ జ‌ట్టు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన ప్రోటీస్ స్టార్ ప్లేయ‌ర్ ఐడైన్ మార్క్‌రమ్‌ను వేలంలోకి విడిచిపెట్టాల‌ని ఎస్ఆర్‌హెచ్ నిర్ణ‌యించుకున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

ఇక ఎస్ఆర్‌హెచ్ యాజ‌మాన్యం త‌మ‌ జ‌ట్టు కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్‌(రూ.18 కోట్లు) తొలి ఆట‌గాటిగా రిటెన్ష‌న్ చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. క‌మ్మిన్స్ ఈ ఏడాది సీజ‌న్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. కెప్టెన్సీతో పాటు వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌లో కూడా ప్యాట్ అద‌ర‌గొట్టాడు.

కాగా ఐపీఎల్‌-2024 మినీ వేలంలో అత‌డిని ఏకంగా రూ.20.50 కోట్ల భారీ ధరకు అతడిని ఎస్‌ఆర్‌హెచ్‌ కొనుగోలు చేసిం‍ది. తన ధరకు తగ్గ న్యాయం ఈ ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌం‍డర్‌ చేశాడు. ఆ త‌ర్వాత స్టార్ ప్లేయ‌ర్ ట్రావిస్ హెడ్‌(రూ.14 కోట్లు) రెండో ప్లేయ‌ర్‌గా, మూడో  ఆట‌గాడిగా అభిషేక్ శ‌ర్మ‌(రూ.11 కోట్లు)ల‌ను ఎస్ఆర్‌హెచ్ అంటిపెట్టుకోనున్న‌ట్లు తెలుస్తోంది. 

అదేవిధంగా నాలుగో ఆటగాడిగా విధ్వంసకర వీరుడు ట్రావిస్‌ హెడ్‌(రూ.18 కోట్లు), ఐదో ప్లేయర్‌గా హెన్రిస్‌ క్లాసెన్‌(రూ.11 కోట్లు)ను రిటైన్ చేసుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్‌ భావిస్తుందంట. ఇక ఆం‍ధ్ర స్టార్‌ ఆల్‌రౌండర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డిని ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా తీసుకోవాలని కావ్యా మారన్‌ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)