Breaking News

SRH Vs KKR: హెన్రిచ్ క్లాసెన్‌ విధ్వంసం.. 37 బంతుల్లో సెంచ‌రీ! వీడియో

Published on Sun, 05/25/2025 - 21:32

ఐపీఎల్‌-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్ హెన్రిచ్ క్లాసెన్ అద్బుత సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు.

అతడి బ్యాటింగ్ ధాటికి ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు. ఈ క్రమంలో క్లాసెన్ కేవ‌లం 37 బంతుల్లోనే త‌న రెండో ఐపీఎల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. క్లాసెన్ ఓవరాల్‌గా 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 పరుగులు చేసి  ఆజేయంగా నిలిచాడు. దీంతో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 

క్లాసెన్‌తో పాటు ట్రావిస్ హెడ్‌(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 32), ఇషాన్‌(29) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, వైభవ్ ఆరోరా ఓ వికెట్ సాధించారు. కాగా ఇది ఐపీఎల్‌లో మూడో అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఐపీఎల్‌లో అత్య‌ధిక టోట‌ల్ న‌మోదు చేసిన రికార్డు కూడా ఎస్ఆర్‌హెచ్ పేరిటే ఉంది. ఐపీఎల్‌-2024లో బెంగ‌ళూరుపై స‌న్‌రైజ‌ర్స్ 3 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 287 ప‌రుగులు చేసింది.


 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)