Breaking News

అక్కడ రూ. 10 కోట్లు.. ఇక్కడ కోటిన్నర!.. కావ్యా మారన్‌ వ్యాఖ్యలు వైరల్‌

Published on Thu, 08/01/2024 - 13:04

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) మెగా వేలానికి సంబంధించి ఫ్రాంఛైజీలు- భారత క్రికెట్‌ నియంత్రణ మండలి మధ్య చర్చలు వాడివేడిగా సాగినట్లు సమాచారం. ముఖ్యంగా ఆటగాళ్ల రిటెన్షన్‌ విధానంలో తమకు స్వేచ్ఛ ఇవ్వాలని పలువురు ఫ్రాంఛైజీ యజమానులు కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్‌ కావ్యా మారన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నిషేధం విధించాలి
‘‘వేలంలో ఓ ఆటగాడిని కొనుగోలు చేసిన తర్వాత.. గాయం మినహా ఇతరత్రా కారణాలు చెప్పి సీజన్‌కు దూరమైతే అతడిపై కచ్చితంగా నిషేధం విధించాలి. నిజానికి ఒక్కో ఫ్రాంఛైజీ తమ జట్టు కూర్పు కోసం అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే ఒక ఆటగాడిని కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతుంది.

కానీ కొందరు ఆటగాళ్లు ముఖ్యంగా విదేశీ ప్లేయర్లు వివిధ కారణాలు చెప్పి సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదు. తక్కువ మొత్తానికి అమ్ముడు పోవడం వల్లే వాళ్లు ఇలా చేస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ.. వాళ్లను కొనుక్కున్న మేము.. అర్ధంతరంగా వారు వెళ్లిపోవడం వల్ల కాంబినేషన్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఒక్కో జట్టు బలం ఒక్కో విధంగా ఉంటుంది
ఇక రిటెన్షన్‌ విషయానికొస్తే.. అట్టిపెట్టుకునే ఆటగాళ్లకు కేటాయించే మొత్తంలో మాకు స్వేచ్ఛ ఇవ్వాలి. అలా అయితే ఆటగాళ్లతో విభేదాలు తలెత్తకుండా ఉంటుంది. ఎందుకంటే.. కొంతమంది తమ కంటే తక్కువ నైపుణ్యాలు కలిగి ఉన్న ఆటగాళ్లకు ఫ్రాంఛైజీ తమ అవసరాల దృష్ట్యా ఎక్కువ మొత్తం చెల్లిస్తుందని భావిస్తూ ఉంటారు. ఇలాంటివి విభేదాలకు దారితీస్తాయి. ఈ వ్యవహారం కాంట్రాక్టు రద్దు చేసుకునేదాకా కూడా వెళ్తుంది.

అయినా.. ఒక్కో జట్టు బలం ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని జట్లలో చాకుల్లాంటి విదేశీ ప్లేయర్లు ఉంటే.. మరికొన్ని జట్లలో టీమిండియా సూపర్‌స్టార్లు ఉంటారు. ఇంకొన్నింటిలో నైపుణ్యాలు గల అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు కూడా ఉంటారు.

మా జట్టు బలం వారే
ఉదాహరణకు.. మా విషయమే తీసుకుంటే.. మా జట్టులో విదేశీ ఆటగాళ్ల బెంచ్‌ పటిష్టంగా ఉంది. కాబట్టి మేము.. నలుగురు విదేశీ ఆటగాళ్లతో పాటు ఇద్దరు క్యాప్డ్‌ ఇండియన్స్‌ లేదంటే ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో పాటు ముగ్గురు అన్‌క్యాప్డ్‌ ఇండియన్స్‌.. ఇలాంటి కాంబినేషన్లలో రిటైన్‌ చేసుకునే విధానం ఉంటే బాగుంటుందని భావిస్తాం. ఈ విషయంలో ఐపీఎల్‌ పాలక మండలి సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి’’ అని కావ్యా మారన్‌ అభిప్రాయపడింది. ఈ మేరకు క్రిక్‌బజ్‌ కథనం ప్రచురించింది.

రన్నరప్‌తో సరి
కాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో ఎక్కువ శాతం విదేశీ ఆటగాళ్లే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌తో పాటు వరల్డ్‌క్లాస్‌ టీ20 స్టార్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌, ట్రవిస్‌ హెడ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్కో జాన్సెన్‌ వంటి వాళ్లు జట్టుకు బలం. ఇక గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన హైదరాబాద్‌ జట్టు ఈ ఏడాది ఏకంగా ఫైనల్‌ చేరుకుంది.

అయితే, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన టైటిల్‌ పోరులో వెనుకబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఆద్యంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి లీగ్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ హయ్యస్ట్‌ స్కోరు(287/3) రికార్డును తమ పేరిట లిఖించుకుంది.

అక్కడ పది కోట్లు 
కాగా ఐపీఎల్‌-2024 వేలంలో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్‌ వనిందు హసరంగను రూ. 1.5 కోట్లకు సన్‌రైజర్స్‌ కొనుగోలు చేసింది. అయితే, గాయం పేరు చెప్పి అతడు సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. కానీ అతడు వేరే కారణాల వల్ల జట్టుకు దూరంగా ఉన్నాడని ఫ్రాంఛైజీ భావించినట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఆర్సీబీకి ఆడిన అతడు రూ. 10 కోట్లు అందుకున్న విషయం తెలిసిందే.
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)