Breaking News

ఈసారి టీ20 వరల్డ్‌కప్‌ భారత్‌దే.. ఆ ఇద్దరే కీలకం: శ్రీశాంత్‌

Published on Fri, 10/04/2024 - 18:01

మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2024లో భారత జట్టు తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. శుక్రవారం దుబాయ్‌ వేదికగా న్యూజిలాండ్‌ మహిళలతో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఉమెన్‌ ఇన్‌ బ్లూ ఉవ్విళ్లూరుతోంది.

ఈ నేపథ్యంలో హర్మన్‌ సేనను ఉద్దేశించి భారత మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టీ20 వరల్డ్‌కప్‌ టైటిల్‌ను కైవసం చేసేకునేందుకు భారత్‌కు అన్ని విధాలగా అర్హత ఉందని శ్రీశాంత్‌ అభిప్రాయపడ్డాడు.

వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసిన భారత జట్టు అద్బుతంగా ఉంది. టీమ్‌తో పాటు భారత్‌కు గొప్ప కోచింగ్‌ స్టాప్‌ ఉంది. ముఖ్యంగా హెడ్‌కోచ్‌ అమోల్ భాయ్ (ముజుందార్) కోసం ఎంత చెప్పకున్న తక్కవే. అతడొక అద్బుతమైన కోచ్‌. ఈ సారి అతడి నేతృ‍త్వంలో భారత్‌ విశ్వవిజేతగా నిలుస్తుందని అనుకుంటున్నా. 

కోచ్‌తో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్‌ కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను నేను చూశాను. తమ జట్టు 100 శాతం ఎఫెక్ట్‌ పెట్టి ఆడితే ఏ జట్టునైనా ఓడించగలదని ఆమె చెప్పుకొచ్చింది అంటూ శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.

ఆ ఇద్దరే కీలకం..
ఈ టోర్నీలో భారత్‌కు  కెప్టెన్‌  హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలు ఎక్స్‌ ఫ్యాక్టర్స్‌(కీలక ఆటగాళ్లగా) మారనున్నారు.
హర్మన్‌ గత కొంత కాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఆమె 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిన ఇన్నింగ్స్‌ మళ్లీ ఈసారి చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను.  

ఆమె ఈ సారి ఏదో మ్యాజిక్‌తో ముందుకు వస్తుందని నమ్మకం నాకు ఉంది. మరోవైపు స్మృతి మంధాన కూడా సత్తాచాటనుంది. అదేవిధంగా జెమీమా రోడ్రిగ్స్ కూడా అద్భుతమైన ప్లేయర్. వీరుముగ్గరు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారత్‌కు తిరిగుండదు అని శ్రీశాత్‌ చెప్పుకొచ్చాడు.
 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)