Breaking News

జాతీయ క్రీడా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published on Wed, 10/01/2025 - 06:26

సాక్షి, న్యూఢిల్లీ: క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, శిక్షకులు, సంస్థలను గౌరవించేందుకు ఉద్దేశించిన జాతీయ క్రీడా పురస్కారాలు–2025 కోసం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏటా ఇచ్చే ఈ అవార్డుల కోసం అర్హులైన వారు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరింది. 

దరఖాస్తుల సమర్పణకు తుది గడువు అక్టోబర్‌ 28వ తేదీ. క్రీడారంగంలో వివిధ విభాగాల్లో విశేష సేవలందించిన వారికి మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు, అర్జున అవార్డు, అర్జున అవార్డు (జీవితకాల సాఫల్యం), ద్రోణాచార్య అవార్డు, రాష్రీ్టయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కార్‌ (ఆర్‌కేపీపీ) పురస్కారాలను అందజేస్తారు. క్రీడాకారులు, కోచ్‌లు, సంస్థలు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ప్రత్యేక పోర్టల్‌ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. అవార్డుల మార్గదర్శకాలు, ఇతర వివరాల కోసం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌  www.dbtyas-sports.gov.in ను చూడాలని కోరింది.   

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు