Breaking News

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌.. ఆసీస్‌కు ఊహించని ఎదురుదెబ్బ

Published on Thu, 08/15/2024 - 13:55

ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు సెప్టెంబ‌ర్‌లో యూకే టూర్‌కు వెళ్లనుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా స్కాట్లాండ్‌తో మూడు టీ20లు, ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, ఐదు వ‌న్డేల సిరీస్‌లో ఆసీస్ త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఈ టూర్‌కు ముందు కంగారుల‌కు ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. 

ఆ జ‌ట్టు లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ గాయం కార‌ణంగా స్కాట్లాండ్‌,  ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ల‌కు దూర‌మ‌య్యాడు.  దిహాండ్రల్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ త‌ర‌పున ఆడుతున్న జాన్సన్ ప్ర‌క్కెటెముక‌ల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో టోర్నీ మ‌ధ్య‌లోనే వైదొలిగాడు.

అయితే అత‌డి గాయం తీవ్ర‌మైన‌ది కావ‌డంతో రెండు నెల‌ల పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే యూకే టూర్‌కు ఈ యువ ఫాస్ట్ బౌల‌ర్ దూర‌మ‌య్యాడు. ఇక అత‌డి స్ధానాన్ని ఆల్‌రౌండ‌ర్ సీన్ అబాట్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా భ‌ర్తీ చేసింది. 

అబాట్‌కు తొలుత కేవ‌లం ఇంగ్లండ్‌తో వ‌న్డే జ‌ట్టులో మాత్రం చోటు ద‌క్కింది. ఇప్పుడు అనూహ్యంగా జాన్స‌న్ త‌ప్పుకోవ‌డంతో అబాట్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఇక​ సెప్టెంబర్ 4న స్కాట్లాండ్‌తో జరగనున్న తొలి టీ20తో ఆసీస్ యూకే టార్ ప్రారంభం కానుంది.

స్కాట్లాండ్‌, ఇంగ్లండ్ సిరీస్‌ల‌కు ఆసీస్ జ‌ట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీప‌ర్‌), మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు