Breaking News

నిప్పులు చేరిన గుజరాత్‌ బౌలర్‌.. బిగ్‌బాష్‌ లీగ్‌ ఛాంపియన్స్‌గా బ్రిస్బేన్‌

Published on Wed, 01/24/2024 - 20:27

బిగ్ బాష్ లీగ్ 2023-24 సీజన్‌ ఛాంపియన్స్‌గా బ్రిస్బేన్ హీట్‌ నిలిచింది. సిడ్నీ గ్రౌండ్‌ వేదికగా జరిగిన ఫైనల్‌ పోరులో సిడ్నీ సిక్సర్స్‌ను 54 పరుగుల తేడాతో చిత్తు చేసిన బ్రిస్బేన్ హీట్‌.. రెండో సారి టైటిల్‌ను ముద్దాడింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్‌.. బ్రిస్బేన్ బౌలర్ల దాటికి కేవలం 112 పరుగులకే కుప్ప​కూలింది.

బ్రిస్బేన్ బౌలర్లలో ఎక్స్‌ప్రెస్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. తన 4 ఓవర్ల కోటాలో 26 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్‌-2024 వేలంలో జాన్సన్‌ను రూ. 10 కోట్లకు గుజరాత్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. జాన్సన్‌తో పాటు ‍బ్రాట్‌లెట్‌,స్వీప్సన్‌ తలా రెండు వికెట్లతో సత్తాచాటారు. సిడ్నీ బ్యాటర్లలో హెన్రిక్స్‌(25) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన బ్రిస్బేన్ 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో 41 బంతుల్లోనే సెంచరీ బాదిన జోష్‌ బ్రౌన్‌.. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 5 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. బ్రౌన్‌తో పాటు రెన్షా(40) పరుగులతో రాణించాడు. సిడ్నీ బౌలర్లలో అబాట్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: టీమిండియాతో మ్యాచ్‌లో ఓవరాక్షన్‌.. స్టార్ క్రికెటర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ

Videos

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

జైలర్ 2 పై అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్ వైరల్

ప్రభాస్ బర్త్‌డే స్పెషల్... కల్కీ 2 నుంచి అదిరిపోయే వీడియో

వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ లేఖ

మే. 2029 వరకు మీరు తగ్గకండి నేను తగ్గను... నేను చాగంటి లా ప్రవచనాలు చెప్పే రకం కాదు

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)