Breaking News

అల్‌కరాజ్‌ అలవోకగా...

Published on Tue, 01/23/2024 - 04:25

మెల్‌బోర్న్‌: గత ఏడాది ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌కు దూరంగా ఉన్న ప్రపంచ రెండో ర్యాంకర్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ ఈ ఏడాది మాత్రం జోరు మీదున్నాడు. మరో అలవోక విజయంతో ఈ స్పెయిన్‌ స్టార్‌ తొలిసారి ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 20 ఏళ్ల అల్‌కరాజ్‌ 6–4, 6–4, 6–0తో మియోమిర్‌ కెచ్‌మనోవిచ్‌ (సెర్బియా)పై గెలిచాడు.

గంటా 49 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ ఐదు ఏస్‌లు సంధించాడు. 43 విన్నర్స్‌ కొట్టిన ఈ మాజీ నంబర్‌వన్‌ 19 అనవసర తప్పిదాలు చేశాడు. ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసిన అల్‌కరాజ్‌ తన సర్విస్‌లో మాత్రం ఒక్కసారి కూడా బ్రేక్‌ పాయింట్‌ అవకాశం ఇవ్వలేదు. క్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో అల్‌కరాజ్‌ తలపడతాడు.

హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జ్వెరెవ్‌ 4 గంటల 5 నిమిషాల్లో 7–5, 3–6, 6–3, 4–6, 7–6 (10/3)తో 19వ సీడ్‌ కామెరాన్‌ నోరీ (బ్రిటన్‌)ను ఓడించి ఊపిరి పీల్చుకున్నాడు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో మూడో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 6–3, 7–6 (7/4), 5–7, 6–1తో నునో బోర్జెస్‌ (పోర్చుగల్‌)పై, తొమ్మిదో సీడ్‌ హుర్కాజ్‌ (పోలాండ్‌) 7–6 (8/6), 7–6 (7/3), 6–4తో ఆర్థర్‌ కాజుక్స్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. 

డయానా సంచలనం 
మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ 93వ ర్యాంకర్, క్వాలిఫయర్‌ డయానా యాస్‌ట్రెమ్‌స్కా సంచలన విజయంతో తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. కెరీర్‌లో 16వసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతున్న ఈ ఉక్రెయిన్‌ క్రీడాకారిణి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 7–6 (8/6), 6–4తో రెండుసార్లు ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్, 18వ సీడ్‌ అజరెంకా (బెలారస్‌)ను బోల్తా కొట్టించింది.

లిండా నొస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), అనా కలిన్‌స్కాయ (రష్యా) కూడా తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... చైనా అమ్మాయి, 12వ సీడ్‌ కిన్‌వెన్‌ జెంగ్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. నొస్కోవా 3–0తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి స్వితోలినా (ఉక్రెయిన్‌) గాయంతో వైదొలిగింది. కిన్‌వెన్‌ జెంగ్‌ 6–0, 6–3తో ఒసీన్‌ డోడిన్‌ (ఫ్రాన్స్‌)పై,  కలిన్‌స్కాయ 6–4, 6–2తో జాస్మిన్‌ పావోలిని  (ఇటలీ)పై విజయం సాధించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)