యూసఫ్‌ పఠాన్‌ ఊచకోత.. అయినా పాపం?(వీడియో)

Published on Thu, 10/17/2024 - 08:04

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ-2024 విజేతగా సదరన్ సూపర్ స్టార్స్ నిలిచింది. శ్రీనగర్‌ వేదికగా కోణార్క్ సూర్యస్, సదరన్ సూపర్ స్టార్స్ మధ్య జరిగిన ఫైనల్‌ పోరు సినిమా థ్రిల్లర్‌ను తలపించింది. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సమాన స్థాయిలో పోరాడడంతో మ్యాచ్ ఫలితం సూపర్‌ ఓవర్‌లో తేలింది. 

కోణార్క్ సూర్యస్‌పై సూపర్‌ ఓవర్‌లో సదరన్‌ జట్టు విజయం సాధించింది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సదరన్‌ సూపర్‌ స్టార్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

సూపర్‌ స్టార్స్‌ బ్యాటర్లలో జింబాబ్వే మాజీ కెప్టెన్‌ హ్యామిల్టన్‌ మసకద్జ(58 బంతుల్లో 83; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.  కోణార్క్‌ సూర్యాస్‌ ఒడిశా బౌలర్లలో మునవీర నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఇర్ఫాన్‌ పఠాన్‌, దివేశ్‌ పఠానియా తలో వికెట్‌ సాధించారు.

యూసఫ్‌ విరోచిత పోరాటం..
అనంతరం లక్ష్యచేధనలో కోణార్క్ సూర్యస్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది.కాగా 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సూర్యస్‌ జట్టును యూసఫ్‌ పఠాన్‌ తన విరోచిత ఇన్నింగ్స్‌తో పోటీలో ఉంచాడు. 

ఈ మ్యాచ్‌లో పఠాన్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 38 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. ఇక సూపర్‌ ఓవర్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన కొణార్క్‌ జట్టు 13 పరుగులు చేసింది. ఆ తర్వాత సదరన్‌ జట్టు కేవలం 4 బంతుల్లోనే టార్గెట్‌ను అందుకుంది. సదరన్‌ స్టార్‌ బ్యాటర్‌ గుప్టిల్‌ వరుసగా రెండు సిక్స్‌లు బాది తమ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.
చదవండి: IPL 2024: సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. క్లాసెన్‌కు రూ.23 కోట్లు!


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)