Breaking News

అఫ్గాన్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా

Published on Fri, 02/21/2025 - 14:18

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025(ICC Champions Trophy)లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు తెరలేచింది.  ఈ మెగా టోర్నీ గ్రూపు-బిలో భాగంగా ల‌హోర్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికా-అఫ్గానిస్తాన్ జ‌ట్లు త‌లప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రోటీస్‌ జట్టు ఈ మ్యాచ్‌లో నలుగురు పేస్‌ బౌలర్లతో ఆడుతోంది.

ఈ మ్యాచ్‌కు విధ్వంసకర ఆటగాడు హెన్రిస్‌ క్లాసెన్‌ గాయం కారణంగా దూరమయ్యాడు. ప్రాక్టీస్‌ సమయంలో క్లాసెన్‌ ఎడమ మోచేయికి గాయమైంది. ఈ విషయాన్ని ప్రోటీస్‌ కెప్టెన్‌ టెంబా బావుమా టాస్‌ సందర్బంగా వెల్లడించాడు. మరోవైపు అఫ్గానిస్తాన్‌ జట్టు ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లతో ఆడుతోంది.

కాగా వన్డే ప్రపంచకప్‌-2023లో దక్షిణాఫ్రికాను అఫ్గాన్‌​ ఓడించింది. ఈ మ్యాచ్‌లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని అఫ్గాన్‌ భావిస్తోంది. ప్రోటీస్‌ మాత్రం గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. కాగా ‍గ్రూపు-బిలో ఇదే తొలి మ్యాచ్‌ కావడం​ గమనార్హం.

తుది జ‌ట్లు
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్ ఆహ్మద్‌

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్‌), టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్‌), రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి
చదవండి: గిల్‌ సెంచరీ కోసం​ హాఫ్‌ సెంచరీని త్యాగం చేసిన రాహుల్‌.. అదే హార్దిక్‌ అయ్యుంటే..!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)