Breaking News

ఆమ్లా, పీటర్సన్‌ విధ్వంసం.. ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం

Published on Tue, 03/04/2025 - 13:00

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీలో ద‌క్షిణాఫ్రికా మాస్టర్స్‌​ ఎట్టకేలకు బోణీ కొట్టింది. సోమ‌వారం వ‌డోద‌ర వేదిక‌గా ఇంగ్లండ్ మాస్ట‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. 

ఇంగ్లండ్‌ బ్యాటర్లలో టి అంబ్రోస్‌(53) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌(36), స్కోఫీల్డ్‌(20) రాణించారు. ఓపెనర్లు మస్టర్డ్‌(0), ఇయాన్‌ బెల్‌ నిరాశపరిచనప్పటికి మోర్గాన్‌, అంబ్రోస్‌ కీలక ఇన్నింగ్స్‌లతో ఇంగ్లీష్‌ జట్టును అదుకున్నారు. ఆఖరిలో ట్రిమ్‌లెట్‌( 4 బంతుల్లో 19 పరుగులు) హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాది జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. ప్రోటీస్‌ బౌలర్లలో ఫిలాండర్‌, హెన్రీ డేవిడ్స్‌, సబాలాల, కుర్గర్‌ తలా వికెట్‌ సాధించారు.

హసీమ్‌ ఆమ్లా విధ్వంసం..
158 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేధించింది. సఫారీల కెప్టెన​్‌ హషీమ్ ఆమ్లా అద్బతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 55 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

అతడితో పాటు పీటర్సన్‌(56) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టువర్ట్‌ మీకర్‌ రెండు, ర్యాన్ సైడ్‌బాటమ్ ఓ వికెట్‌ సాధించారు. సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం పాయింట్లపట్టికలో నాలుగో స్ధానంలో ఉంది.
చదవండి: అత‌డికి కొత్త బంతిని ఇవ్వండి.. హెడ్‌కు చుక్క‌లు చూపిస్తాడు: అశ్విన్‌

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)