Breaking News

శ్రీలంక‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా..

Published on Fri, 05/09/2025 - 18:01

సొంతగడ్డపై జ‌రుగుతున్న మహిళ‌ల ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో శ్రీలంకకు మ‌రో ప‌రాభావం ఎదురైంది. శుక్రవారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో శ్రీలంక ఓటమి పాలైంది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది.

సౌతాఫ్రికా బ్యాటర్లలో అన్నేరీ డెర్క్సెన్(104) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. క్లోయ్ ట్రయాన్(74), లారా వోల్వార్డ్(33), బ్రిట్స్‌(38), నాడిన్ డి క్లెర్క్(32) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లంక బౌలర్లలో దేవ్మీ విహంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. ఆతపట్టు, మనుడి నానాయక్కర తలా వికెట్ సాధించారు. 

అనంత‌రం 316 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన శ్రీలంక 42.5 ఓవ‌ర్ల‌లో 239 ప‌రుగుల‌కు ఆలౌటైంది. లంక బ్యాట‌ర్ల‌లో చామరి ఆత‌పట్టు(52) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. అనుష్క సంజీవని(43), హ‌ర్షితా స‌మ‌ర‌విక్ర‌మ‌(33), పెరీరా(30) రాణించారు.

స‌ఫారీ బౌల‌ర్ల‌లో క్లోయ్ ట్రయాన్ ఐదు వికెట్ల‌తో చెల‌రేగింది. అందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. ఆమెతో పాటు ఖాఖా రెండు, శేష్నీ నాయుడు, స్మిత్ త‌లా వికెట్ సాధించారు. ఇక మే 11(ఆదివారం) జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ పోరులో భార‌త్‌-శ్రీలంక జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

Videos

రవి కార్తీక్ కు జగన్ అభినందనలు..

జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ అంబటి సెటైర్లు అదుర్స్

చుట్టమల్లే... ఆగలేదా? జూ.ఎన్టీఆర్ పై మళ్లీ...

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు