Breaking News

ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్‌ సొంతం

Published on Mon, 01/30/2023 - 11:28

బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో ప్రొటీస్‌ సొంతం చేసుకుంది. 343 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ప్రోటీస్‌ విజయంలో ఆ జట్టు కెప్టెన్‌ టెంబా బావుమా కీలక పాత్ర పోషించాడు.

102 బంతులు ఎదుర్కొన్న బావుమా 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 109 పరుగులు చేశాడు. అదే విధంగా డెవిడ్‌ మిల్లర్‌ కూడా 58 పరుగులతో ఆజేయం నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఓలీ స్టోన్‌, రషీద్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్‌ కుర్రాన్‌ ఒక్క వికెట్‌ సాధించాడు. ఇ‍క తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 342 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

ఇంగ్లండ్‌ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్‌(80), జోస్‌ బట్లర్‌(94 నాటౌట్‌), మొయిన్‌ అలీ(51) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రోటిస్‌ బౌలర్లలో నోర్జే రెండు వికెట్లు సాధించగా.. పార్నెల్‌, ఎంగిడీ, మార్‌క్రమ్‌, జానెసన్‌ తలా వికెట్‌ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే కింబర్లీ వేదికగా ఫిబ్రవరి 1న జరగనుంది.
చదవండి: Gongadi Trisha: శెభాష్‌ బిడ్డా! మ్యాచ్‌ను మలుపు తిప్పిన త్రిష.. భద్రాచలంలో సంబరాలు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)