Breaking News

మూడు మ్యాచ్‌లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్‌ క్రికెటర్‌

Published on Wed, 03/13/2024 - 15:35

దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఇటీవలే(మార్చి 10) తన గర్ల్‌ ఫ్రెండ్‌ కామిల్లా హారిస్‌ను వివాహమడిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సింది. కానీ మిల్లర్‌ బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసున్నాడు. బీపీఎల్‌లో ఫార్చూన్ బరిషల్‌ జట్టుకు మూడు మ్యాచులు ఆడితే ఏకంగా రూ. 1.25 కోట్లను చెల్లించేందుకు ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ ఇచ్చింది.

దీంతో మిల్లర్‌ తన పెళ్లిని వాయిదా వేసుకుని ఫార్చూన్ బరిషల్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు .  ఫిబ్రవరి 26 (ఎలిమినేటర్), ఫిబ్రవరి 28 (క్వాలిఫయర్‌ 2), మార్చి 1న (ఫైనల్‌) ఫార్చూన్ బరిషల్‌కు మిల్లర్‌ ఆడాడు. బీపీఎల్‌-2024 విజేతగా ఫార్చూన్ బరిషల్‌ జట్టు నిలిచింది. తాజాగా ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ వెల్లడించాడు.

"పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో బీజీగా ఉండటంతో బీపీఎల్‌ను పెద్దగా ఫాలో కాలేదు. అయితే ఈ ఏడాది బీపీఎల్‌ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారన్న విషయం గురించి నా స్నేహితులను ఆడిగాను. అప్పుడే నాకు ఓ సంచలన విషయం తెలిసింది.

మూడు మ్యాచ్‌లు ఆడితే డేవిడ్ మిల్లర్‌కు 1.50 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ఫార్చూన్ బరిషల్‌ ఫ్రాంచైజీ ముందుకు వచ్చింది. దీంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు" దిపెవిలియన్‌ షోలో అక్రమ్‌ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు మిల్లర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌ షాక్‌.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)