Breaking News

T20 World Cup: ద‌క్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్టు స్పాన్స‌ర్‌గా అమూల్‌...

Published on Thu, 05/02/2024 - 17:36

టీ20 వరల్డ్‌కప్‌-2024 మరో నెల రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదిక‌గా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది.  ఈ క్ర‌మంలో ఈ మెగా ఈవెంట్‌లో భాగమయ్యే ఆయా క్రికెట్ బోర్డులు ఒక్కొక్కటిగా తమ జ‌ట్ల‌ వివరాలను వెల్లడిస్తున్నాయి. 

ఇప్ప‌టికే భార‌త్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి అగ్ర‌శ్రేణి క్రికెట్ బోర్డులు త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి. ఇక ఇది ఇలా ఉండ‌గా.. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో భారత డెయిరీ దిగ్గజం అమూల్ అమెరికా, దక్షిణాఫ్రికా జట్ల ప్రధాన స్పాన్సర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. ఈ మెర‌కు గురువారం న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్య‌క్ర‌మంలో అమెరికా, ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుల‌తో అమూల్‌ ఒప్పందం కుదుర్చుకుంది.  

ఈ విషయాన్ని ఇరు జట్ల క్రికెట్ బోర్డులు ధ్రువీక‌రించాయి. కాగా గ‌తంలో కూడా ద‌క్షిణాఫ్రికాకు స్పాన్స‌ర్‌గా అమూల్ వ్య‌వ‌హ‌రించింది. ద‌క్షిణాఫ్రికాతో పాటు నెదర్లాండ్స్, అఫ్గానిస్తాన్ జ‌ట్ల‌కు సైతం  అమూల్ స్పాన్స‌ర్ చేసింది. కాగా ఈ మెగా ఈవెంట్‌లో బాగా రాణించాల‌ని అమెరికా, దక్షిణాఫ్రికా జ‌ట్ల‌కు అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయన్ మెహతా శుభాకాంక్షలు తెలియ‌జేశారు. 

అదే విధంగా అమెరికా, ప్రోటీస్ క్రికెట్ బోర్డులతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ పొట్టి వరల్డ్‌కప్‌లో అమెరికా తమ తొలి మ్యాచ్‌లో జూన్ 1న కెనడాతో తలపడగా.. దక్షిణాఫ్రికా జూన్ 3న శ్రీలంకను ఢీకొట్టనుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)