Breaking News

ఇటువంటి కమ్‌బ్యాక్ ఇప్పటి వరకూ చూడలేదు.. అతడొక అద్భుతం: గంగూలీ

Published on Sat, 06/10/2023 - 12:53

ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా వెటరన్‌ ఆటగాడు అజింక్య రహానే అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి వచ్చిన రహానే కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కోహ్లి, రోహిత్‌, పుజరా వంటి స్టార్‌ ఆటగాళ్లు విఫలమైన చోట.. రహానే తన అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు.

129 బంతుల్లో 89 పరుగులు చేసిన రహానే.. శార్దూల్ ఠాకూర్ (51)తో కలిసి ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఇక రీ ఎంట్రీలో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన రహానేపై భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ.. రహానే మాత్రం పోరాట పటిమ కనబరిచాడని దాదా కొనియాడాడు.

"రహానే 18 నెలల పాటు అతడు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే రహానే ఈ తరహా ఇన్నింగ్స్‌ ఆడటం అంత ఈజీ కాదు. అయినప్పటికీ అతడు మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. చాలా మంది అతడి కెరీర్‌ ముగిపోయిందని భావించారు. నిజానికి రహానే కూడా అదే అనుకుని ఉంటాడు. భారత్‌ క్రికెట్‌లో ఒక బ్యాటర్‌ తిరిగి జట్టులో చోటు సంపాదించుకుని తనను తాను నిరూపించుకోవడం అంత సులువు కాదు.

రహానే రీ ఎంట్రీ మాత్రం అద్భుతం. గతంలో చాలా మంది ఆటగాళ్లు కొంత కాలం పాటు జట్టుకు దూరంగా ఉండి రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ రహానే వంటి రీ ఎంట్రీ నేను ఇప్పుడు వరకు చూడలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ అతడు మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు అని స్టార్‌స్పోర్ట్స్‌ షోలో గంగూలీ పేర్కొన్నాడు.
చదవండి: WTC Final: మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు