Breaking News

‘ఆసియా క్రికెట్‌’ మ్యాచ్‌లన్నీ ఆ నెట్‌వర్క్‌లోనే లైవ్‌ స్ట్రీమింగ్‌..!

Published on Sat, 11/23/2024 - 10:39

భారత్‌కు చెందిన సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ (ఎస్పీఎన్‌ఐ) ఆసియా క్రికెట్‌కు సంబంధించి ప్రత్యేక మీడియా హక్కుల్ని దక్కించుకుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ)తో సోనీ సంస్థ ఎనిమిదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. 

ఇందులో భాగంగా ఈ ఏడాది (2024) నుంచి 2031 సీజన్‌ ముగిసేదాకా ఏసీసీ ఆధ్వర్యంలో జరిగే పురుషులు, మహిళల ఆసియా కప్, అండర్‌–19 ఆసియా కప్, ఎమర్జింగ్‌ జట్ల ఆసియా కప్‌ మ్యాచ్‌లను సోనీ నెట్‌వర్క్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

ఈ ఒప్పందంలో టెలివిజన్‌ ప్రసార హక్కులతో పాటు డిజిటల్, ఆడియో మాధ్యమాలకు సంబంధించిన హక్కులు కూడా కలిసి ఉన్నాయి. అయితే ఈ ఒప్పందం విలువ బయటికి వెల్లడించకపోయినప్పటికీ గతంకంటే 70 శాతం ఎక్కువని ఏసీసీ ప్రకటించింది. ఇది ఆసియా క్రికెట్‌ టోర్నీలకు ఉన్న ఆదరణను తెలియజేస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది.

ఏసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ ‘క్రికెట్‌ నైపుణ్యానికి ఆసియా కప్‌ మూలస్తంభంలా నిలుస్తోంది. మా కొత్త మీడియా భాగస్వామి సోనీ ప్రపంచ శ్రేణి కవరేజీతో ప్రపంచ వ్యాప్తంగా మరెంతో మంది క్రికెట్‌ వీక్షకుల్ని సంపాదిస్తుందన్న నమ్మకం ఉంది. 

పెరిగిన మీడియా హక్కుల విలువతో ఆసియా సభ్యదేశాల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో క్రికెట్‌ కార్యక్రమాలు కూడా పెరుగుతాయి’ అని విశ్వాసం వెలిబుచ్చారు. సోనీ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ గౌరవ్‌ బెనర్జీ మాట్లాడుతూ దాయాదులు భారత్, పాక్‌ సహా ఏసీసీ మ్యాచ్‌లు తమ వీక్షకులకు మరింత వినోదాన్ని పంచుతాయని అన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)