Breaking News

నాన్నకు ప్రేమతో...

Published on Wed, 07/29/2026 - 04:04

ఆ అబ్బాయికి అప్పటికి ఆరేళ్ల వయసు... తన తండ్రి సాధించిన ఘనత ఏమిటో అతనికేమీ తెలేదు... కానీ తర్వాతి రోజుల్లో అదే అతనికి స్ఫూర్తిగా నిలిచింది. ఎంత వద్దనుకున్నా మనసు వెయిట్‌లిఫ్టింగ్‌ వైపు మళ్లింది. చివరకు తండ్రి బాటలో పతకాల వేట మొదలు పెట్టిన ఆ కుర్రాడు ఇప్పుడు తన నాన్న ఘనతను పునరావృతం చేశాడు. సరిగ్గా చెప్పాలంటే తండ్రికంటే మరో అడుగు ముందుకు వేశాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం, రజతం గెలిచిన తండ్రీకొడుకుల గాథ ఇది. 2010 ఢిల్లీ కామన్వెల్త్‌ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో వల్లూరి శ్రీనివాసరావు పతకధారి కాగా....16 ఏళ్ల తర్వాత వల్లూరి అజయ్‌ బాబు మెడల్‌ సొంతం చేసుకొని సగర్వంగా నిలిచాడు.  

శ్రీనివాసరావు 2010 క్రీడల్లో 56 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్యం గెలుచుకున్నాడు. ఆర్మీలో ఉద్యోగిగా ఉన్న ఆయన తన ఆరేళ్ల అబ్బాయిని కూడా తనతో పాటు పుణేలోని శిక్షణా కేంద్రానికి తరచుగా తీసుకువెళ్లేవాడు. తండ్రి మాట ప్రకారం ఆరంభంలో ఆటల వైపు కాకుండా చదువు పైనే అజయ్‌ దృష్టి పెట్టాడు. కానీ ఇంట్లో కనిపిస్తున్న కామన్వెల్త్‌ క్రీడల పతకం అతడిని పదే పదే వెయిట్‌లిఫ్టింగ్‌ వైపు మళ్లించింది. దాంతో సహజంగానే శ్రీనివాసరావు తొలి కోచ్‌గా మారి ఆటలో ఓనమాలు నేర్పించాడు. 

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొండవెలగాడ స్వస్థలం కాగా, శిక్షణ కోసం అజయ్‌ విజయవాడకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అవకాశం లభించడంతో అతని కెరీర్‌ మారిపోయింది. ఈ క్రమంలో జాతీయ జూనియర్‌ చాంపియన్‌గా నిలవడంతో అతను మరింత పైకి ఎదిగాడు. కీలక సమయాల్లో తండ్రి అండగా నిలుస్తూ అందించిన ప్రోత్సాహం అజయ్‌ను సరైన దిశలో నడిపించింది. రెండేళ్ల క్రితం మోచేతికి గాయమై శస్త్ర చికిత్స జరిగినప్పుడు మళ్లీ కోలుకొని వెయిట్‌లిఫ్టింగ్‌పై దృష్టి పెట్టేందుకు నాన్న ఇచ్చిన చేయూతే ఫలితాలు అందించింది. 

గత ఏడాది కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతోనే ఈ మెగా ఈవెంట్‌లో అజయ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. తండ్రితో పోలిక కూడా మొదలైంది. గ్లాస్గోకు వెళ్లే ముందు స్వర్ణం సాధిస్తానని అతను తండ్రికి మాటిచ్చాడు. అయితే పసిడి దక్కకపోయినా వెండి పతక విలువేమీ తక్కువ కాదు. ప్రస్తుతం 21 ఏళ్ల వయసే ఉన్న అజయ్‌కు మున్ముందు మరిన్ని పెద్ద విజయాలు సాధించగల సత్తా ఉందని ఈ ప్రదర్శన నిరూపించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)