Breaking News

టీ20 బ్లాస్ట్‌ 2023 విజేత సోమర్‌సెట్‌.. ఫైనల్లో ఎసెక్స్‌పై గెలుపు

Published on Sun, 07/16/2023 - 14:38

2023 సీజన్‌ టీ20 బ్లాస్ట్‌ విజేతగా సోమర్‌సెట్‌ జట్టు నిలిచింది. నిన్న (జులై 15) జరిగిన ఫైనల్లో సోమర్‌సెట్‌.. ఎసెక్స్‌పై 14 పరుగుల తేడాతో గెలిచి, ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సోమర్‌సెట్‌ నిర్ణీత ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్‌ కాగా.. స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేని ఎసెక్స్‌ 18.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

సోమర్‌సెట్‌ బౌలర్లు మ్యాట్‌ హెన్రీ (4/25), ఐష్‌ సోధి (3/22), లెవిస్‌ గ్రెగరీ (2/25), క్రెయిగ్‌ ఓవర్టన్‌ (1/30) ఎసెక్స్‌ పతనాన్ని శాశించారు. ఎసెక్స్‌ ఇన్నింగ్స్‌లో డేనియల్‌ సామ్స్‌ (45), ఆడమ్‌ రోసింగ్టన్‌ (19), డేనియల్‌ లారెన్స్‌ (16), పాల్‌ వాల్టర్‌ (26) రెండంకెల స్కోర్లు చేయగా, మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. 

అంతకుముందు సీన్‌ డిక్సన్‌ (53) రాణించడంతో సోమర్‌సెట్‌ నిర్ణీత ఓవర్లలో 145 పరుగులు చేసి ఆలౌటైంది. సోమర్‌సెట్‌ ఇన్నింగ్స్‌లో టామ్‌ బాంటన్‌ (20), కోహ్లెర్‌ క్యాడ్‌మోర్‌ (19), గ్రెగరీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఎసెక్స్‌ బౌలర్లలో స్నేటర్‌, పాల్‌ వాల్టర్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. డేనియల్‌ సామ్స్‌, క్రిచ్లీ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.  

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)