Breaking News

ఆమె నిజాయితీని అమ్ముకుంది: మండిపడ్డ బబిత

Published on Thu, 10/24/2024 - 11:11

ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌పై మాజీ రెజ్లర్‌, బీజేపీ నేత బబితా ఫొగట్‌ మండిపడ్డారు. తన పుస్తకాన్ని అమ్ముకోవడం కోసం.. సాక్షి తన నిజాయితీని కూడా పూర్తిగా అమ్మేసుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా 2016లో రియో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సాక్షి మాలిక్‌.. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించారు.

హర్యానాకు చెందిన సాక్షి ఇటీవలే తన ఆత్మకథ ‘విట్‌నెస్‌’ను మార్కెట్‌లో విడుదల చేశారు. అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు భారత స్టార్‌ రెజ్లర్ల మధ్య విభేదాలకు కారణమయ్యాయి. భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పలువురు రెజ్లర్లు ఢిల్లీ వేదికగా ఉద్యమం నడిపిన విషయం తెలిసిందే.

వినేశ్‌తో సాక్షి మాలిక్‌
స్వార్థంగా ఆలోచించారు
ఇందులో సాక్షి మాలిక్‌తో పాటు వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ పునియా తమ గళాన్ని గట్టిగా వినిపించారు. బబితా ఫొగట్‌ సైతం రెజ్లర్ల నిరసనకు తన మద్దతు ప్రకటించారు. అయితే, ఈ ఉద్యమ సమయంలో ఆసియా క్రీడల సెలక్షన్స్‌ నుంచి తమకు మినహాయింపు కావాలని వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ కోరడం వల్ల తమకు చెడ్డపేరు వచ్చిందని సాక్షి తన పుస్తకంలో పేర్కొన్నారు.

బబిత నటనకు కారణం అదే
ఎవరో ఉద్దేశపూర్వకంగానే వినేశ్‌, బజరంగ్‌లను రెచ్చగొట్టి  ఇలా అత్యాశకు పోయేలా.. స్వార్థం నింపి ఉంటారని సాక్షి అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. బబిత ఫొగట్‌ తమ ఉద్యమానికి మద్దతు తెలపడంలో కూడా స్వార్థమే ఉందని ఆరోపించారు.

తాము బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడితే.. బబిత మాత్రం రిజ్‌భూషణ్‌ స్థానంలో తాను రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే.. తమ శ్రేయోభిలాషి తరహాలో బబిత ప్రవర్తించిందని సాక్షి మాలిక్‌ విమర్శించారు.

నీ బాధ నాకు అర్థమవుతుందిలే
ఈ నేపథ్యంలో సాక్షి ఆరోపణలపై బబితా ఫొగట్‌ ఘాటుగా స్పందించారు. ‘‘నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. దాని ద్వారానే నువ్వు ప్రకాశించాలి. అంతేగానీ.. ఇతరులను నిందించడం ద్వారా ఇంకెన్నాళ్లు నువ్వు ప్రకాశించగలవు? కొందరికి అసెంబ్లీ సీట్లు వచ్చాయి.

కొందరేమో పదవులు పొందారు. కానీ.. నువ్వు మాత్రం ఏదీ పొందలేకపోయావు కదా! నీ బాధ నాకు అర్థమవుతుందిలే!.. ఆమె తన పుస్తకాన్ని అమ్ముకోవడం కోసం తన నిజాయితీని కూడా అమ్ముకుంది’’ అని ఎక్స్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు బబిత.

వినేశ్‌ స్పందన ఇదే
అంతకు ముందు వినేశ్‌ ఫొగట్‌ సైతం సాక్షి మాలిక్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘మాది స్వార్థమా? ఇలా ఎందుకు అన్నారో ఆమెనే అడగండి. తోటి అక్కాచెల్లెళ్ల కోసం పోరాడితే దానిని స్వార్థమే అంటారంటే.. అవును ఈ విషయంలో మేము స్వార్థపరులమే. దేశం కోసం ఒలింపిక్‌ పతకం తేవడం స్వార్థమే అయితే.. అంతకంటే గొప్ప స్వార్థం మరొకటి ఏది ఉంటుంది?

నేను, సాక్షి, బజరంగ్‌ బతికి ఉన్నంతకాలం మా ఉద్యమం సజీవంగానే ఉంటుంది. ఈ ప్రయాణంలో కొన్ని అవాంతరాలు వస్తాయి. అయినా.. సరే మేము గట్టిగా పోరాడతాం’’ అని పేర్కొన్నారు. కాగా బబిత, వినేశ్‌ కజిన్స్‌ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. బజరంగ్‌.. బబిత సొంత చెల్లెలు సంగీత భర్త.

రాజకీయాల్లో ఫొగట్‌ కుటుంబం
ఇదిలా ఉంటే.. బబిత బీజేపీలో చేరగా.. వినేశ్‌ ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచి జులానా ఎమ్మెల్యే అయ్యారు. బజరంగ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీ మెంబర్‌.అయితే, సాక్షి వ్యాఖ్యలపై ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇచ్చిన కౌంటర్లు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: ‘గదికి పిలిచి.. భుజాలపై చేతులు వేశాడు’

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)