Breaking News

ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.. ! ఇక అంతే మరి

Published on Fri, 08/18/2023 - 14:10

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌ గాయాల కారణంగా ప్రోటీస్‌ టూర్‌కు దూరమయ్యారు. స్మిత్‌ ప్రస్తుతం మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా గాయపడిన స్మిత్‌.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మరో రెండు నెలలో వన్డే ప్రపంచకప్‌ ఉండడటంతో అతడిని ఆడించి రిస్క్‌ చేయకూడదని క్రికెట్‌ ఆస్ట్రేలియా భావించింది.

ఈ క్రమంలో స్మిత్‌ నాలుగు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు మిచిల్‌ స్టార్క్‌ గజ్జ గాయంతో బాధపడుతున్నాడు. అతడు కూడా మరో నాలుగు నుంచి ఐదు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి స్మిత్‌, స్టార్క్‌ వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారినపడడం ఆస్ట్రేలియా మెన్‌జ్‌మెంట్‌ను కలవరపెట్టే ఆంశమనే చెప్పుకోవాలి. 

ఇక దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు స్మిత్‌ స్ధానాన్ని ఆస్టన్‌ టర్నర్‌తో భర్తీ చేయగా.. వన్డేల్లో మార్నస్‌ లాబుషేన్‌కు ఛాన్స్‌ ఇచ్చారు. అదేవిధంగా స్టార్క్‌ స్ధానాన్ని యువ పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌తో క్రికెట్‌ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. కంగూరు జట్టు ప్రోటిస్ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఆగస్టు 30న డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ20తో ఆసీస్‌ పర్యటన ప్రారంభం కానుంది.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఆసీస్‌ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్‌), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అష్టన్ టర్నర్, ఆడమ్ జాంపా

దక్షిణాఫ్రికాతో వన్డే  సిరీస్‌కు ఆసీస్‌ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్‌), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అష్టన్ టర్నర్, ఆడమ్ జాంపా
చదవండి: #Virat Kohli: అరంగేట్రంలో విఫలం.. కట్‌ చేస్తే.. ప్రపంచ క్రికెట్‌లో రారాజుగా! ఏకంగా సచిన్‌తో పోటీ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)