రికీ భుయ్, కేఎస్‌ భరత్‌ మెరుపులు.. గోవాపై ఆంధ్ర ఘన విజయం

Published on Thu, 11/28/2024 - 09:20

సాక్షి, హైదరాబాద్‌: కెప్టెన్‌ రికీ భుయ్‌ (38 బంతుల్లో 72 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), వికెట్‌ కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ (38 బంతుల్లో 57 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకాలతో మెరిశారు. ఫలితంగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీలో ఆంధ్ర జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్‌ ‘ఈ’లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 8 వికెట్ల తేడాతో గోవాను చిత్తు చేసింది. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గోవా నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ప్రభుదేశాయ్‌ (51 బంతుల్లో 71 నాటౌట్‌; 9 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకోగా... అర్జున్‌ టెండూల్కర్‌ 9 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, శశికాంత్‌ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. 

అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. రికీ భుయ్, శ్రీకర్‌ భరత్‌ ధనాధన్‌ షాట్లతో కట్టిపడేశారు. అశ్విన్‌ హెబర్‌ (13), షేక్‌ రషీద్‌ (8) విఫలం కాగా... భరత్, భుయ్‌ మూడో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఆంధ్ర జట్టు 8 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం మహారాష్ట్రతో ఆంధ్ర ఆడుతుంది.    

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)