Breaking News

హార్దిక్‌ పాండ్యా విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్ల వర్షం

Published on Sun, 11/24/2024 - 07:11

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న హార్దిక్‌.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ కేవలం 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా గుజరాత్‌పై బరోడా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆర్య దేశాయ్‌ 52 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ 33 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో హేమంగ్‌ పటేల్‌ (10 బంతుల్లో 26; ఫోర్‌, 3 సిక్సర్లు), రిపల్‌ పటేల్‌ (7 బంతుల్లో 18 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) బ్యాట్‌ ఝులిపించారు. బరోడా బౌలర్లలో అతీత్‌ సేథ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్‌, కృనాల్‌, మహేశ్‌ పితియా తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడాను హార్దిక్‌ పాండ్యా ఒంటిచేత్తో గెలిపించాడు. హార్దిక్‌కు జతగా శివాలిక్‌ శర్మ (43 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. హార్దిక్‌, శివాలిక్‌ చెలరేగడంతో బరోడా మరో మూడు బంతులు మిగిలుండగానే (5 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని చేరుకుంది. హార్దిక్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడి బరోడాను విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ రెండు.. చింతన్‌ గజా, అర్జన్‌ నగస్వల్లా, తేజస్‌ పటేల్‌ తలో వి​కెట్‌ పడగొట్టారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)