హార్దిక్‌ పాండ్యా విఫలం.. షమీకి రెండు వికెట్లు

Published on Wed, 12/11/2024 - 13:10

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌ ముగింపునకు చేరుకుంది. సెమీ ఫైనల్స్‌కు చేరే క్రమంలో ఎనిమిది జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్‌, బరోడా- బెంగాల్‌, ముంబై- విదర్భ, ఢిల్లీ- ఉత్తరప్రదేశ్‌ మధ్య క్వార్టర్‌ ఫైనల్స్‌ జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా తొలుత సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్‌(క్వార్టర్‌ ఫైనల్‌-3) మ్యాచ్‌ ఫలితం వెలువడింది. కర్ణాటకలోని ఆలూర్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్రపై ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్‌ గెలిచింది. తద్వారా సెమీస్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది.

బరోడా ఓపెనర్లు భళా
ఇక క్వార్టర్‌ ఫైనల్‌-1లో భాగంగా బరోడా బెంగాల్‌తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన బరోడా తొలుత బ్యాటింగ్‌ చేసింది. 

ఓపెనర్లు శశ్వత్‌ రావత్‌(26 బంతుల్లో 40), అభిమన్యు సింగ్‌ రాజ్‌పుత్‌(34 బంతుల్లో 37) రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా విఫలమయ్యాడు.

పాండ్యా బ్రదర్స్‌ విఫలం
మొత్తంగా 11 బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేశాడు హార్దిక్‌ పాండ్యా. ఇక అతడి అన్న, బరోడా జట్టు కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యా సైతం పూర్తిగా నిరాశపరిచాడు. పదకొండు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులే చేసి నిష్క్రమించాడు. 

శివాలిక్‌, విష్ణు మెరుపు ఇన్నింగ్స్‌
మిగతా వాళ్లలో శివాలిక్‌ శర్మ(17 బంతుల్లో 24),  భాను పనియా(11 బంతుల్లో 17), విష్ణు సోలంకి(7 బంతుల్లో 16 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగలిగింది. 

బెంగాల్‌ బౌలర్లలో టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ, కనిష్క్‌ సేత్‌, ప్రదీప్త ప్రమాణిక్‌ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. గెలుపు కోసం నువ్వా- నేనా అన్నట్లు పోటీపడిన ఈ మ్యాచ్‌లో బరోడా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.బ్యాటింగ్‌లో విఫలమైన హార్దిక్‌ మూడు వికెట్లతో మెరిశాడు.

బరోడా వర్సెస్‌ బెంగాల్‌ తుదిజట్లు
బెంగాల్‌
అభిషేక్ పోరెల్ (వికెట్‌ కీపర్‌), కరణ్ లాల్, సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్‌), రిటిక్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, రిత్విక్ చౌదరి, ప్రదీప్త ప్రమాణిక్, కనిష్క్ సేథ్, మహ్మద్‌ షమీ, సాక్షిమ్ చౌదరి, సయన్ ఘోష్.

బరోడా
శశ్వత్ రావత్, అభిమన్యు సింగ్ రాజ్‌పుత్, భాను పనియా, శివాలిక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విష్ణు సోలంకి (వికెట్‌ కీపర్‌), కృనాల్ పాండ్యా (కెప్టెన్‌), అతిత్ షేత్, మహేష్ పితియా, లుక్మాన్ మేరీవాలా, ఆకాష్ మహరాజ్ సింగ్

చదవండి: SMAT 2024: వెంకటేశ్‌ అయ్యర్‌ ఆల్‌రౌండ్‌ షో.. సెమీస్‌లో మధ్యప్రదేశ్‌

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)