Breaking News

నిస్సాంక అద్భుత ఇన్నింగ్స్‌ వృథా.. ఉత్కంఠ పోరులో ఓడిన శ్రీలంక

Published on Sat, 12/28/2024 - 16:07

మౌంట్‌ మౌంగానుయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 8 పరుగుల తేడాతో శ్రీలంకపై కివీస్‌ విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమతమైంది. లక్ష్య చేధనలో లంకకు ఓపెనర్లు పాథుమ్‌ నిస్సాంక, కుశాల్‌ మెండిస్‌ అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.

తొలి వికెట్‌కు 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో శ్రీలంక సునయాసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ శ్రీలంక ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ వేసిన కివీ పేసర్‌ జాకబ్‌ ఢఫీ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు.

కుశాల్‌ మెండిస్‌(46),కుశాల్‌ పెరీరా(0), కమిందు మెండిస్‌(0)లను ఒకే ఓవర్‌లో ఔట్‌ చేసి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌ వైపు మలుపుతిప్పాడు. ఆ తర్వాత లంకేయులు తిరిగి కోలుకోలేకపోయారు. ఆఖరి ఓవర్‌లో శ్రీలంక విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి.

అయితే లంక ఓటమిపాలైనప్పటికి పాథుమ్‌ నిస్సాంక మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 90 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్‌ బౌలర్లలో డఫీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫోల్క్స్‌, హెన్రీ తలా రెండు వికెట్లు సాధించారు.

అదరగొట్టిన మిచెల్‌, బ్రేస్‌వెల్‌
అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లలో డార్లీ మిచెల్‌(62), బ్రేస్‌వెల్‌(59) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. లంక బౌలర్లలో ఫెర్నాండో, థీక్షణ, హసరంగా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికలో డిసెంబర్‌ 30న జరగనుంది.
చదవండి: టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్‌ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)