Breaking News

ఆఫ్ఘనిస్తాన్‌ సంచలనం.. తమ కంటే మెరుగైన జట్టుపై ఘన విజయం

Published on Fri, 06/02/2023 - 18:33

SL VS AFG 1st ODI: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోటలో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంకపై ఆఫ్ఘనిస్తాన్‌ సంచలన విజయం సాధించింది. రషీద్‌ ఖాన్‌ లాంటి స్టార్‌ స్పిన్నర్‌ లేకపోయినా ఆఫ్ఘన్లు.. లంకేయులకు భారీ షాకిచ్చారు. యువ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (98 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్‌డౌన్‌ బ్యాటర్‌ రహ్మత్‌ షా (55) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి, తమ కంటే పటిష్టమైన లంకేయులను 6 వికెట్ల తేడాతో మట్టికరించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ 1-0 ఆధిక్యంలో వెళ్లింది. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. చరిత్‌ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్‌ నిస్సంక (38), దుషన్‌ హేమంత (22) ఓ మోస్తరుగా రాణించగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో ఫజల్‌ హక్‌ ఫారూకీ, ఫరీద్‌ అహ్మద్‌ మలిక్‌ చెరో 2 వికెట్లు.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, నూర్‌ అహ్మద్‌, మహ్మద్‌ నబీ తలో వికెట్‌ పడగొట్టారు. 

ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్‌ ఆది నుంచే అద్భుతంగా ఆడి, మరో 19 బంతులుండగానే విజయతీరాలకు చేరింది. ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్భాజ్‌ (14) విఫలమైనా.. ఇబ్రహీం జద్రాన్‌, రహ్మత్‌ షా రెండో వికెట్‌కు 146 పరుగులు జోడించి, ఆఫ్ఘనిస్తాన్‌ విజయాన్ని ఖరారు చేశారు. ఆఖర్లో కెప్టెన్‌ హస్మతుల్లా షాహిది (38), మహ్మద్‌ నబీ (27 నాటౌట్‌) బాధ్యతగా ఆడి ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిపించారు.

ఐపీఎల్‌-2023లో సీఎస్‌కే తరఫున ఇరగదీసిన పేసర్‌ మతీష పతిరణ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. ఈ మ్యాచ్‌ ద్వారానే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పతిరణ.. 8.5 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకుని ఓ  వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. లంక బౌలర్లలో కసున్‌ రజిత 2, లహీరు కుమార ఓ వికెట్‌ దక్కించుకున్నారు. పతిరణతో పాటు అరంగేట్రం చేసిన స్పిన్నర్‌ దుషన్‌ హేమంత (9-0-50-0) కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్‌ 46.5 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసి విజయం సాధించింది. మూడు వన్డేల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇదే వేదికగా జూన్‌ 4న, మూడో వన్డే కూడా ఇదే వేదికగా జూన్‌ 7న జరుగనున్నాయి.

చదవండి: WTC Final 2021-23: ఎక్కడా మన వాళ్లు టాప్‌లో లేరు.. అయినా ఫైనల్‌కు..!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)