Breaking News

సూపర్‌ సినెర్‌

Published on Tue, 11/18/2025 - 08:44

ట్యూరిన్‌: సొంతగడ్డపై 2025 సీజన్‌ను ఇటలీ టెన్నిస్‌ సూపర్‌ స్టార్‌ యానిక్‌ సినెర్‌ అద్భుతంగా ముగించాడు. పురుషుల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ సినెర్‌ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సింగిల్స్‌ ఫైనల్లో సినెర్‌ 7–6 (7/4), 7–5తో ప్రపంచ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌)పై విజయం సాధించాడు. 2 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్‌ ఎనిమిది ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సరీ్వస్‌లో 43 పాయింట్లకుగాను 36 పాయింట్లు... రెండో సరీ్వస్‌లో 35 పాయింట్లకుగాను 19 పాయింట్లు సంపాదించాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు.  

  • ఈ గెలుపుతో సినెర్‌ వరుసగా రెండో ఏడాది ఏటీపీ ఫైనల్స్‌ టోరీ్నలో టైటిల్‌ను దక్కించుకున్నాడు. గత సంవత్సరంతోపాటు ఈ ఏడాది కూడా సినెర్‌ టైటిల్‌ గెలిచే క్రమంలో ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ ఓడిపోయినా... ముఖాముఖి రికార్డులో అల్‌కరాజ్‌ 10–6తో సినెర్‌పై ఆధిక్యంలో ఉన్నాడు.  

  • 1970లో ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ ప్రారంభమయ్యాక ఇప్పటి వరకు వరుసగా రెండేళ్లు ఒక్క సెట్‌ చేజార్చుకోకుండా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా సినెర్‌ రికార్డు నెలకొల్పాడు.  

  • టైటిల్‌ నెగ్గిన సినెర్‌కు 50,71,000 డాలర్ల (రూ. 44 కోట్ల 92 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. రన్నరప్‌ అల్‌కరాజ్‌ ఖాతాలో 27,04,000 డాలర్ల (రూ. 23 కోట్ల 95 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు చేరాయి.  

  • ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీని వరుసగా రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన తొమ్మిదో ప్లేయర్‌గా సినెర్‌ గుర్తింపు పొందాడు. గతంలో జొకోవిచ్‌ (సెర్బియా), ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), ఇవాన్‌ లెండిల్‌ (చెక్‌ రిపబ్లిక్‌), పీట్‌ సంప్రాస్‌ (అమెరికా), ఇలీ నస్టాసె (రొమేనియా), జాన్‌ మెకన్రో (అమెరికా), జాన్‌ బోర్గ్‌ (స్వీడన్‌), లీటన్‌ హెవిట్‌ (ఆస్ట్రేలియా) ఈ ఘనత సాధించారు.    

#

Tags : 1

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?