Breaking News

టౌన్‌సెండ్‌ - సినియకోవా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

Published on Mon, 01/27/2025 - 04:09

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో గతంలో ఒక్కసారి కూడా మూడో రౌండ్‌ దాటి ముందుకెళ్లలేకపోయిన అమెరికా క్రీడాకారిణి టేలర్‌ టౌన్‌సెండ్‌ ఈసారి మాత్రం డబుల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కాటరీనా సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో జత కట్టి తన కెరీర్‌లో రెండోసారి గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్‌ను దక్కించుకుంది.

గత ఏడాది వింబుల్డన్‌ టోర్నీలో సినియకోవాతో కలిసి మహిళల డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన టౌన్‌సెండ్‌ ఈసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ టౌన్‌సెండ్‌ృసినియకోవా ద్వయం 6-2, 6-7 (4/7), 6-3తో సె సు వె (చైనీస్‌ తైపీ)-ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా) జోడీపై గెలిచింది. 

టౌన్‌సెండ్‌-సినియకోవాలకు 8,10,000 ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 4 కోట్ల 41 లక్షలు)... సె సు వెృఒస్టాపెంకోలకు 4,40,000 డాలర్లు (రూ. 2 కోట్ల 39 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. సినియకోవా కెరీర్‌లో ఇది 10వ గ్రాండ్‌స్లామ్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ కావడం విశేషం. 

గతంలో ఆమె బార్బరా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో కలిసి 2022, 2023 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో... 2018, 2021 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో... 2018, 2022 వింబుల్డన్‌ టోర్నీలో... 2022 యూఎస్‌ ఓపెన్‌లో... కోకో గాఫ్‌ (అమెరికా)తో కలిసి 2024 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో... టౌన్‌సెండ్‌తో కలిసి 2024 వింబుల్డన్‌ టోర్నీలో మహిళల డబుల్స్‌ టైటిల్‌ను సాధించింది.  
 
భళా బెర్నెట్‌... 
మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ జూనియర్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో బాలుర సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన తొలి స్విట్జర్లాండ్‌ ప్లేయర్‌గా హెన్రీ బెర్నెట్‌ గుర్తింపు పొందాడు. జూనియర్‌ బాలుర సింగిల్స్‌ ఫైనల్లో 18 ఏళ్ల బెర్నెట్‌ 6-3, 6-4తో బెంజమిన్‌ విల్‌వెర్త్‌ (అమెరికా)పై విజయం సాధించాడు. 

గతంలో స్విట్జర్లాండ్‌ తరఫున జూనియర్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో హెయింజ్‌ గుంతార్ట్‌ (1976 ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌), రోజర్‌ ఫెడరర్‌ (1998 వింబుల్డన్‌), రోమన్‌ వాలెంట్‌ (2001 వింబుల్డన్‌), స్టానిస్లాస్‌ వావ్రింకా (2003 ఫ్రెంచ్‌ ఓపెన్‌), డొమినిక్‌ స్ట్రయికర్‌ (2020 ఫ్రెంచ్‌ ఓపెన్‌) విజేతలుగా నిలిచారు. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)