Breaking News

క్వార్టర్‌ ఫైనల్లో సింధు 

Published on Fri, 03/29/2024 - 02:17

మాడ్రిడ్‌: స్పెయిన్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నిలో రెండో సీడ్, భారత స్టార్‌ పీవీ సింధు జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయంతో ఈ ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు 21–14, 21–12తో హువాంగ్‌ యు సున్‌ (చైనీస్‌ తైపీ)పై విజయం సాధించింది.

36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు తొలి గేమ్‌ ఆరంభంలో కాస్త పోటీ ఎదురైంది. స్కోరు 11–12 వద్ద సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా తొమ్మిది పాయింట్లు గెలిచి 20–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు దూకుడు కొనసాగింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో థాయ్‌లాండ్‌ ప్లేయర్‌ సుపనిదతో సింధు ఆడుతుంది.

ముఖా ముఖి రికార్డులో సింధు 5–3తో ఆధిక్యంలో ఉంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలంగాణకు చెందిన సిక్కి రెడ్డి–సుమీత్‌ రెడ్డి జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిక్కి–సుమీత్‌ ద్వయం 22–20, 21–18తో ప్రెస్లీ స్మిత్‌–అలీసన్‌ లీ (అమెరికా) జంటపై గెలిచింది.  

అశ్విని–తనీషా జోడీ గెలుపు 
మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్‌) ద్వయం క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అశ్విని–తనీషా జంట 21–14, 21–8తో టిఫానీ హో–గ్రోన్యా సోమర్‌విల్లె (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది.

పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ధ్రువ్‌ కపిల–అర్జున్‌ (భారత్‌) ద్వయం 21–17, 21–19తో క్రిస్టోఫర్‌–మాథ్యూ గ్రిమ్లె (స్కాట్లాండ్‌) జంటపై నెగ్గగా... గరగ కృష్ణప్రసాద్‌–సాయిప్రతీక్‌ (భారత్‌) జోడీ 16–21, 21–15, 16–21తో క్రిస్టో పొపోవ్‌–తొమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌) జంట చేతిలో ఓడిపోయింది.   

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)