Breaking News

తొలిరౌండ్‌లో సింధు ఓటమి

Published on Wed, 10/09/2024 - 03:48

పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత పాల్గొన్న తొలి టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే పరాజయం ఎదురైంది. ఫిన్‌లాండ్‌లో మంగళవారం మొదలైన ఆర్క్‌టిక్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోలేకపోయింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్‌ సింధు 16–21, 10–21తో ప్రపంచ 32వ ర్యాంకర్‌ మిచెల్లి లీ (కెనడా) చేతిలో ఓడిపోయింది. 

గతంలో మిచెల్లి లీపై 10 సార్లు గెలిచిన సింధు నాలుగోసారి ఆమె చేతిలో ఓటమి చవిచూసింది. ఇదే టోర్నీలో ఆడుతున్న భారత రైజింగ్‌ స్టార్స్‌ మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్‌ తొలి రౌండ్‌లో గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రపంచ 23వ ర్యాంకర్‌ సుంగ్‌ షువో యున్‌ (దక్షిణ కొరియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్‌ మాళవిక 21–19, 24–22తో నెగ్గగా... ప్రపంచ 39వ ర్యాంకర్‌ వైవోన్‌ లీ (జర్మనీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్‌ ఆకర్షి 21–19, 21–14తో విజయం సాధించింది. 

పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ కిరణ్‌ జార్జి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో కిరణ్‌ జార్జి 21–16, 13–21, 21–19తో లుకాస్‌ క్లియర్‌»ౌట్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు.   

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)