Breaking News

సింధు ఓటమి.. లక్ష్యసేన్‌ శుభారంభం; సాత్విక్‌-చిరాగ్‌ జోడి దూకుడు

Published on Wed, 07/26/2023 - 15:53

తెలుగుతేజం పీవీ సింధు వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే కొరియా ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన సింధు తాజాగా జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలోనూ తొలి రౌండ్‌కే పరిమితమైంది. బుధవారం రౌండ్‌ ఆఫ్‌ 32లో చైనాకు చెందిన జాంగ్‌ యిమాన్‌ చేతిలో పీవీ సింధు.. 21-12, 21-13తో ఓటమిపాలయ్యింది. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన 13 బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌లో సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. 

లక్ష్యసేన్‌ శుభారంభం..
ఇక పురుషుల విభాగంలో టాప్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో మన దేశానికే చెందిన ప్రియాన్షు రావత్‌పై 21-15, 12-21, 24-22తో గెలిచి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. కొరియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీకి దూరంగా ఉన్న లక్ష్యసేన్‌ అంతకముందు జరిగిన కెనడా ఓపెన్‌ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో విజేతగా అవతరించాడు.

జోరు మీదున్న సాత్విక్‌-చిరాగ్‌ జోడి
ఈ ఆదివారం కొరియా ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్స్‌ గెలిచి జోరు మీదున్న భారత డబుల్స్‌ స్టార్‌ షట్లర్స్‌ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ జోడి కూడా శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కార్నాడో, డేనియల్‌ మార్టిన్‌ ద్వయంపై 21-16, 11-21, 21-13తో గెలిచి రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు.

చదవండి: IND Vs WI ODI Series: తొలి వన్డే.. సంజూ శాంసన్‌కు చోటు, ఇషాన్‌కు మొండిచెయ్యేనా!

 రెండు పెళ్లిళ్లు పెటాకులు! 69 ఏళ్ల వయసులో మూడోసారి! ఎవరీ బ్యూటీ?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)