Breaking News

సింధు, ప్రణయ్‌ శుభారంభం

Published on Wed, 05/28/2025 - 01:32

సింగపూర్‌: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేశారు. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీ మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో పీవీ సింధు 21–14, 21–9 తేడాతో వెన్‌ యూ జాంగ్‌ (కెనడా)పై విజయం సాధించింది. 31 నిమిషాల్లో ముగిసిన పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన తెలుగమ్మాయి వరస గేమ్‌ల్లో గెలుపొందింది. బుధవారం జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ఐదో ర్యాంకర్‌ చెన్‌ యూ ఫీ (చైనా)తో సింధు తలపడనుంది. 

పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 34వ ర్యాంకర్‌ ప్రణయ్‌ 19–21, 21–16, 21–14తో రాస్‌మస్‌ గెమ్కే (డెన్మార్క్‌)పై గెలుపొందాడు. 72 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్‌లో ఓడిన అనంతరం తిరిగి పుంజుకున్న ప్రణయ్‌... ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరుస్తూ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. తదుపరి రౌండ్‌లో ఫ్రాన్స్‌ షట్లర్‌ క్రిస్టోవ్‌ పొపోవ్‌తో ప్రణయ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు. కాగా ఈ టోర్నీలో మిగిలిన భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. 

మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్, అన్‌మోల్‌ పరాజయం పాలవగా... పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్, కిరణ్‌ జార్జ్‌కు నిరాశ తప్పలేదు. మాళవిక, ప్రియాన్షు తొలి గేమ్‌ గెలిచినప్పటికీ అదే జోరు కొనసాగించడంలో విఫలమై పరాజయాల పాలయ్యారు. మాళవిక 21–14, 18–21, 11–21తో ఎనిమిదో సీడ్‌ సుపనిడా కటెథాంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో... ప్రియాన్షు 21–14, 10–21, 14–21తో ఏడో సీడ్‌ నరోకా (జపాన్‌) చేతిలో ఓడాడు. 

అన్‌మోల్‌ 11–21, 22–24తో చెన్‌ చేతిలో... కిరణ్‌ జార్జ్‌ 19–21, 17–21తో వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌ (చైనా) చేతిలో సంతోష్‌ రామ్‌రాజ్‌ 14–21, 8–21తో కిమ్‌ గా ఇన్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓడారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో, అషిత సూర్య–అమృత ప్రథమేశ్‌ జోడీలు నిరాశ పరచగా... మహిళల డబుల్స్‌లో కవిప్రియ సెల్వం–సిమ్రన్‌ సింగ్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.   

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)