టీమిండియా స్టార్‌ క్రికెటర్‌కు విడాకులు మంజూరు..

Published on Thu, 10/05/2023 - 08:55

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శిఖర్‌ దావన్‌, అతడి మాజీ భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీలోని  ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. గత కొంత కాలంగా ఆయేషా ముఖర్జీకి ధావన్‌ దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసిస్తోందని ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో ధావన్‌ విడాకుల పిటిషన్‌ ధాఖలు చేశాడు.

దీంతో ఈ కేసు కోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది. తన భార్యపై ధావన్‌ చేసిన ఆరోపణలు అన్నీ వాస్తవమైనవని న్యాయమూర్తి హరీష్ కుమార్ విశ్వసించారు. కొన్నాళ్ల పాటు కుమారుడితో విడిగా ఉండాలని భార్య ఆయేషా ఒత్తిడి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. 

అదే విధంగా ఆస్ట్రేలియాలో తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన మూడు ఆస్తులలో 99 శాతం తనని యజమానిగా చేయాలని ఆయేషా తనను ఒత్తిడి చేసిందన్న ధావన్ ఆరోపణను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది.

కాగా ధావన్‌, ఆయేషా దంపతుల కుమారుడి శాశ్వత కస్టడీపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. కానీ ధావన్‌కు భారత్‌ లేదా ఆస్ట్రేలియాలో తన కుమారుడిని కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా వీడియో కాల్‌ ద్వారా కూడా ధావన్‌ తన కుమారుడితో మాట్లాడవచచ్చని పేర్కొంది.

కాగా వీరిద్దరికి 2012లో వివాహం కాగా... జొరావర్‌ అనే 9 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన ఆయేషాకు శిఖర్‌తో పరిచయం కాక ముందే పెళ్లయింది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఆ తర్వాత ధావన్‌-ఆయేషా వ్యక్తిగత కారణాల వల్ల ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో 2021లో ధావన్‌తో విడాకులు తీసుకుంటున్నాని ఆయేషానే స్వయంగా వెల్లడించింది.
చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్‌- కివీస్‌ తొలి పోరు.. ఎవరి బలాబలాలు ఎంత..? రికార్డులు ఎలా ఉన్నాయంటే?:

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)