Breaking News

పేలిన పోలార్డ్‌.. కేక పుట్టించిన కాట్రెల్‌

Published on Thu, 03/16/2023 - 11:14

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023 ఎడిషన్‌లో ఓ ఫైనల్‌ బెర్తు ఖరారైంది. నిన్న (మార్చి 15) లాహోర్‌ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా మహ్మద్‌ రిజ్వాన్‌ నేతృత్వంలోని ముల్తాన్‌ సుల్తాన్స్‌ తుదిపోరుకు అర్హత సాధించింది. ఇంకో రెం‍డు మ్యాచ్‌ల తర్వాత సుల్తాన్స్‌తో తలపడబోయే రెండో ఫైనలిస్ట్‌ ఎవరో తేలిపోతుంది.

ఇవాళ (మార్చి 16) జరిగే ఎలిమినేటర్‌ 1 మ్యాచ్‌లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌, పెషావర్‌ జల్మీ తలపడనుండగా.. రేపు జరుగబోయే ఎలిమినేటర్‌ 2 మ్యాచ్‌లో లాహోర్‌ ఖలందర్స్‌ ఎలిమినేటర్‌ 1 విజేతను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేత మార్చి 19న జరిగే ఫైనల్లో ముల్తాన్‌ సుల్తాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 

ఇక నిన్న జరిగిన మ్యాచ్‌ విషయానికొస్తే.. లాహోర్‌ ఖలందర్స్‌పై ముల్తాన్‌ సుల్తాన్స్‌ 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సుల్తాన్స్‌.. పోలార్డ్‌ (34 బంతుల్లో 57; ఫోర్‌, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్‌ సెంచరీతో చెలరేగడం‍తో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, ఛేదనలో షెల్డన్‌ కాట్రెల్‌ (3-0-20-3), ఉసామా మిర్‌ (2-0-12-2) ధాటికి ఖలందర్స్‌ 14.3 ఓవర్లలో 76 పరుగులకే చాపచుట్టేసింది.

సుల్తాన్స్‌ ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ రిజ్వాన్‌ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉస్మాన్‌ ఖాన్‌ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు), టిమ్‌ డేవిడ్‌ (15 బంతుల్లో 22 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) ఓ మోస్తరుగా రాణించగా.. ఖలందర్స్‌ ఇన్నింగ్స్‌లో సామ్‌ బిల్లింగ్స్‌ (19), డేవిడ్‌ వీస్‌ (12), హరీస్‌ రౌఫ్‌ మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. ఖలందర్స్‌ బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌ 3, జమాన్‌ ఖాన్‌, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. సుల్తాన్స్‌ బౌలర్లలో కాట్రెల్‌ 3, మిర్‌ 2, అన్వర్‌ అలీ, అబ్బాస్‌ అఫ్రిది, ఇహసానుల్లా, కీరన్‌ పోలార్డ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

Videos

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు