Breaking News

షేక్‌ రషీద్‌ డబుల్‌ సెంచరీ

Published on Sat, 11/16/2024 - 03:32

సాక్షి, హైదరాబాద్‌: కెప్టెన్ షేక్‌ రషీద్‌ (372 బంతుల్లో 203; 28 ఫోర్లు) డబుల్‌ సెంచరీ , తో చెలరేగడంతో హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 147 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న పోరులో ఓవర్‌నైట్‌ స్కోరు 168/2తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 143 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. 

కరణ్‌ షిండే (221 బంతుల్లో 109; 12 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా... షేక్‌ రషీద్‌ ద్విశతకంతో విజృంభించాడు. తాజా రంజీ సీజన్‌లో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న రషీద్‌ ఈసారి పూర్తి సాధికారికతతో బ్యాటింగ్‌ చేయగా... హైదరాబాద్‌ బౌలర్లు అతడిని కట్టడి చేయలేకపోయారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన రషీద్‌... పరిస్థితులను ఆకలింపు చేసుకున్న అనంతరం ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 

ఈ క్రమంలో మూడో వికెట్‌కు కరణ్‌ షిండేతో కలిసి రషీద్‌ 236 పరుగులు జోడించి జట్టుకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించి పెట్టాడు. హనుమ విహారి (0) డకౌట్‌ కాగా... వికెట్‌ కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ (33; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో అనికేత్‌ రెడ్డి 4 వికెట్లు... చామా మిలింద్, రక్షణ్‌ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం యరా సందీప్‌ (73 బంతుల్లో 33 బ్యాటింగ్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), లలిత్‌ మోహన్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)