Breaking News

జింబాబ్వేతో వన్డే సిరీస్‌.. శ్రీలంక జట్టు ప్రకటన! కెప్టెన్‌గా మెండిస్‌

Published on Thu, 01/04/2024 - 13:34

స్వదేశంలో జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌తో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌.. శ్రీలంక వన్డే జట్టు  కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. అతడి డిప్యూటీగా మిడిలార్డర్‌ బ్యాటర్‌ చరిత్‌ అసలంక వ్యవహరించనున్నాడు. ఇక గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగా పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు.

ఈ జట్టులో అతడికి చోటు దక్కింది. కాగా ఇటీవలే శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌గా హసరంగా ఎంపికైన సంగతి తెలిసిందే. అదే విధంగా గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌-2023 మధ్యలోనే తప్పుకున్న మాజీ కెప్టెన్‌ దసున్‌ షనక కూడి జింబాబ్వే సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

కాగా తొలుత ఈ సిరీస్‌కు 21 మంది సభ్యుల ప్రిలిమనరీ జట్టును ఎంపిక చేసింది. అందులో ఇప్పుడు 17 మంది పేర్లను ఉపుల్‌ తరంగా నేతృత్వంలోని లంక సెలెక్షన్‌ కమిటీ ఖారారు చేసింది. జనవరి 6న కొలంబో వేదికగా  ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.
జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్‌), చరిత్ అసలంక (వైస్‌ కెప్టెన్‌), పాతుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సహన్ అరాచ్చిగే, నువానీడు ఫెర్నాండో, దసున్ షనక, జనిత్ లియానాగే, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర, ప్రమోద్ చమీర, వాండర్సే, అకిల దనంజయ, వనిందు హసరంగా (ఫిట్‌నెస్‌కు లోబడి).
చదవండి:
 #Saim Ayub: బ్యాటింగ్‌లో విఫలం.. ఈజీ క్యాచ్‌ వదిలేశాడు.. బాబర్‌ రియాక్షన్‌ వైరల్‌

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)