Breaking News

అంపైర్‌పై పాక్‌ కెప్టెన్‌ సీరియస్‌.. ఇది ఔటా? నాటౌటా? వీడియో

Published on Wed, 08/21/2024 - 17:39

రావ‌ల్పిండి వేదిక‌గా బుధ‌వారం (ఆగ‌స్టు21) బంగ్లాదేశ్‌-పాకిస్తాన్ మ‌ధ్య తొలి టెస్టు ప్రారంభ‌మైంది. వ‌ర్షం కార‌ణంగా ఆల‌స్యంగా ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ శాంటో పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్హ‌నించాడు.

అయితే ఈ మ్యాచ్‌లో థ‌ర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణ‌యం వివాద‌స్ప‌ద‌మైంది. అంపైర్ త‌ప్పుడు నిర్ణ‌యానికి పాక్ కెప్టెన్ షాన్ మ‌సూద్ బ‌లైపోయాడని నెటిజ‌న్లు అంపైర్‌పై మండిప‌డుతున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే?
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు మంచి ఆరంభం ద‌క్క‌లేదు. మూడో ఓవ‌ర్‌లోనే ఓపెనర్ అబ్దుల్ ష‌ఫీక్ పెవిలియ‌న్‌కు చేరాడు. ఈ క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్ షాన్ మ‌సూద్‌.. మ‌రో ఓపెనర్ అయూబ్‌తో క‌లిసి ఇన్నింగ్స్ చ‌క్క‌దిద్దాల‌ని భావించాడు. 

కానీ మసూద్ అనుకున్న‌ది జ‌ర‌గ‌లేదు. బంగ్లా పేస‌ర్ షోర్‌ఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో అనూహ్యంగా మ‌సూద్ పెవిలియ‌న్‌కు చేరాల్సి వ‌చ్చింది. పాక్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవ‌ర్ వేసిన షోర్‌ఫుల్ ఐదో బంతిని బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు.

 అయితే మసూద్ మిడ్-ఆఫ్ వైపు డిఫెన్స్ ఆడటానికి ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్‌కు ద‌గ్గ‌ర‌గా మిస్స్ అయ్యి వికెట్ కీప‌ర్ చేతికి వెళ్లింది. వెంట‌నే వికెట్ కీప‌ర్ లిట్ట‌న్ దాస్ క్యాచ్ ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ త‌ల ఊపాడు. 

ఈ క్ర‌మంలో బంగ్లా కెప్టెన్ రివ్యూకు వెళ్లాడు. అయితే ఆల్ట్రాఎడ్జ్‌లో బంతి ప్యాడ్‌కు తాకిన స‌మ‌యంలో స్పైక్ వ‌చ్చిన‌ట్లు క‌న్పించింది. అదే స‌మ‌యంలో బ్యాట్ కూడా బంతికి ద‌గ్గ‌ర‌గా ఉందని భావించిన థర్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. 

అంపైర్‌ నిర్ణయాన్ని బిగ్‌ స్క్రీన్‌పై చూసిన మసూద్‌ షాక్‌కు గురయ్యాడు. అంపైర్‌పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ మసూద్‌ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఎక్స్‌లో షేర్‌ చేసింది.  కేవలం 6 పరుగులు మాత్రమే చేసి మసూద్‌ ఔటయ్యాడు.

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)