Breaking News

క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. వీడియో వైరల్‌

Published on Fri, 06/21/2024 - 16:18

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం యార్క్‌షైర్, లాంక్షైర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్‌కు సారథ్యం వహిస్తున్న పాకిస్తాన్‌ ఆటగాడు షాన్‌ మసూద్‌ ఒకే బంతికి హిట్ వికెట్‌తో పాటు రనౌటయ్యాడు.

కానీ అంపైర్‌ మాత్రం నాటౌట్‌ ఇచ్చాడు.  వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) నిబంధనల కారణంగా మసూద్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి బతికిపోయాడు.

అసలేం జరిగిందంటే?
యార్క్‌షైర్‌ ఇన్నింగ్స్‌ 15వ వేసిన బ్లాథర్విక్ బౌలింగ్‌లో మూడో బంతిని షాన్‌ మసూద్‌ రివర్స్‌ స్కూప్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాలెన్స్‌ కోల్పోయిన మసూద్‌ తన కాలితో స్టంప్స్‌ను తాకాడు. దీంతో బెయిల్స్‌ కిందపడిపోయాయి.

 ఈ క్రమంలో తన ఔట్‌ అని గ్రహించిన మసూద్‌.. నాన్‌స్ట్రైకర్‌ జోరూట్‌ రన్‌కు పరిగెత్తుకుంటూ వచ్చినప్పటకి తను మాత్రం క్రీజులోనే ఉండిపోయాడు. అయితే అంతలోనే అంపైర్‌ నో బాల్‌గా సిగ్నల్‌ ఇవ్వడంతో మసూద్‌ కూడా నాన్‌స్ట్రైకర్‌ వైపు పరిగెత్తాడు. 

కాగా అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్లు వికెట్లను గిరాటేశారు. దీంతో మసూద్‌ రనౌటయ్యాని నిరాశచెందాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్టు చోటు చేసుకుంది. ఫీల్డ్‌ అంపైర్ మాత్రం నాటౌట్‌గా సిగ్నల్‌ ఇచ్చి అందరిని గందరగోళానికి గురిచేశాడు. అయితే మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) రూల్స్‌ ప్రకారమే అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు.

రూల్స్ ఏం చెబుతున్నాయి..?
ఎంసీసీ రూల్ 31.7 ప్రకారం.. అంపైర్‌ ఔట్‌ ఇవ్వకుండా బ్యాటర్‌ తనంతట తానే ఔట్‌ అయినట్లు తప్పుగా భావిస్తే అంపైర్‌ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి నాటౌట్‌ ఇవ్వవచ్చు. మసూద్‌ విషయంలో కూడా అదే జరిగింది. తన హిట్‌వికెట్‌ అయ్యాడని భావించిన మసూద్‌ రన్‌కు పరిగెత్తి మధ్యలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే రనౌటయ్యాడు. 

కానీ ఉద్దేశపూర్వకంగా మసూద్‌ అలా చేయలేదని భావించిన అంపైర్‌ నౌటౌట్‌గా ఇచ్చాడు. అయితే అది నో బాల్‌ కావడంతో హిట్‌వికెట్‌ను కూడా అంపైర్‌ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో మసూద్‌ తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.
చదవండి: IND vs SA: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్‌ ఇదే
 

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు