Breaking News

వైడ్‌ ఇవ్వలేదని అంపైర్ మీదకు వెళ్లిన షకీబ్‌.. ఇదేమి బుద్దిరా బాబు!

Published on Sun, 01/08/2023 - 21:24

బంగ్లాదేశ్‌ టెస్టు కెప్టెన్‌ షకీబ్ అల్ హసన్ మరోసారి తన ప్రశాంతతను కోల్పోయాడు. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో షకీబ్‌ దురుసు ప్రవర్తను ప్రదర్శించాడు. వైడ్‌బాల్‌ విషయంలో అంపైర్‌తో వాగ్వాదానికి షకీబ్‌ దిగాడు. బీపీఎల్‌-2023లో భాగంగా శనివారం ఫార్చ్యూన్ బరిషల్, సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఏం జరిగిందంటే?
బీపీఎల్‌లో ఫార్చ్యూన్ బరిషల్‌కు షకీబ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఫార్చ్యూన్ ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌లో రెహమాన్ రాజా వేసిన ఒక షార్ట్ బాల్‌ షకీబ్‌ పై నుంచి వెళ్లింది. అయితే అంపైర్‌ దాన్ని తొలి బౌన్సర్‌గా సిగ్నిల్‌ ఇచ్చాడు. షకీబ్‌ మాత్రం అది ఎలా బౌన్సర్‌ అవుతుందని లెగ్‌ అంపైర్‌పై ఆగ్రహాం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో అతడు లెగ్‌ అంపైర్‌పై గట్టిగా అరుస్తూ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. అయితే అంపైర్‌ సరైన వివరణ ఇవ్వడంతో చేసేదేమీ లేక మళ్లీ క్రీజులోకి వెళ్లిపోయాడు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంతకు ముందు 2021లో ఢాకా ప్రీమియర్‌లో కూడా ఈ విధంగానే ప్రవర్తించాడు. అప్పటిల్లో అది తీవ్ర వివాదాస్పదకావడంతో షకీబ్‌ క్షమాపణలు కూడా తెలిపాడు.


చదవండి: Rishabh Pant: బీసీసీఐ మంచి మనసు.. పంత్‌ క్రికెట్‌ ఆడకపోయినా ఫుల్ సాలరీ!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)