WC 2023: వరల్డ్‌కప్‌ తర్వాత నో కెప్టెన్సీ.. రిటైర్మెంట్‌ అప్పుడే!

Published on Thu, 09/28/2023 - 14:16

WC 2023- I Won't Lead In ODIs After That: Shakib al Hasan: బంగ్లాదేశ్‌ కెప్టెన్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌ సారథిగా వైదొలుగుతానని స్పష్టం చేశాడు. మేనేజ్‌మెంట్‌ కోరినందు వల్లే వన్డే జట్టు పగ్గాలు చేపట్టానని.. ఇది కేవలం టీమ్‌ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నాడు.

తన స్వార్థం కోసం సారథిగా రాలేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా మాజీ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ రిటైర్మెంట్‌ ప్రకటన నేపథ్యంలో షకీబ్‌ అల్‌ హసన్‌ వన్డే కెప్టెన్సీ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్‌-2023లో జట్టును ముందుండి నడిపిన షకీబ్‌ అల్‌ హసన్‌.. ప్రపంచకప్‌ టోర్నీలోనూ సారథిగా వ్యవహరించనున్నాడు.


వరల్డ్‌కప్‌ తర్వాత నో కెప్టెన్సీ.. రిటైర్మెంట్‌ అప్పుడే
ఈ నేపథ్యంలో టీ- స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ వన్డే కెప్టెన్సీ, రిటైర్మెంట్‌ గురించి తన ప్రణాళికలు వెల్లడించాడు. ‘‘అంతర్జాతీయస్థాయిలో నేను 2025 వరకు కొనసాగే అవకాశం ఉంది. వన్డే ఫార్మాట్‌ చాంపియన్స్‌ ట్రోఫీలో భాగమవ్వాలనుకుంటున్నాను.

ఇక టీ20 ఫార్మాట్‌లో టీ20 ప్రపంచకప్‌-2024 వరకు జట్టుతో ఉండాలనుకుంటున్నా. టెస్టుల విషయంలోనూ వరల్డ్‌కప్‌ తర్వాత నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా. బహుశా ఒకేసారి అన్ని ఫార్మాట్లకు ఒకేసారి వీడ్కోలు పలుకుతానేమో.

భవిష్యత్తు మన చేతుల్లో ఉండదు కదా! ప్రస్తుతానికైతే రిటైర్మెంట్‌ విషయంలో నా ఆలోచన ఇదీ’’ అని 36 ఏళ్ల షకీబ్‌ అల్‌ హసన్‌ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌గా ఎదిగిన ఈ వెటరన్‌ ఆల్‌రౌండర్‌.. ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 11 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు 600 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: 'ఈ డర్టీ గేమ్‌లో నాకు ఆడాలని లేదు.. కావాలనే నన్ను తప్పించారు': తమీమ్‌ ఇక్బాల్‌

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)