CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం
Breaking News
వన్డే ప్రపంచకప్.. బంగ్లాదేశ్ కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్
Published on Fri, 08/11/2023 - 19:05
బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్సీ నుంచి ఆ జట్టు స్టార్ఆటగాడు తమీమ్ ఇక్భాల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలో జరిగే ఆసియాకప్-2023, వన్డే ప్రపంచకప్లో బంగ్లా జట్టు సారధిగా స్టార్ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శుక్రవారం ధృవీకరించింది.
అదే విధంగా ఈ రెండు మెగా ఈవెంట్లకు 17 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ తెలిపారు. "ఆసియా కప్, ప్రపంచకప్లో మా జట్టు కెప్టెన్గా షకీబ్ను నియమించాము. రేపు(ఆగస్టు 12)న ఈ రెండు ఈవెంట్లకు మా జట్టును ప్రకటిస్తాము.
సెలక్టర్లు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు" అని విలేకురల సమావేశంలో నజ్ముల్ హసన్ పేర్కొన్నారు. కాగా షకీబ్ ప్రస్తుతం టీ20ల్లో బంగ్లా జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. అంతకుముందు 2011లో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో బంగ్లా కెప్టెన్గా షకీబ్ అల్ హసనే వ్యవహరించాడు.
ఇక ఆసియాకప్-2023లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్లో ఆగస్టు 31న శ్రీలంకతో తలపడనుంది. అదే విధంగా ఆక్టోబర్ 7న ఆఫ్గానిస్తాన్తో తమ వరల్డ్కప్ ప్రయాణాన్ని బంగ్లా ప్రారంభించనుంది.
చదవండి: CPL 2023: అంబటి రాయుడు కీలక నిర్ణయం.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఆంధ్ర ఆటగాడు
Tags : 1