Breaking News

పాక్‌తో వన్డే సిరీస్‌.. వెస్టిండీస్‌ జట్టు ప్రకటన! స్టార్‌ ప్లేయర్‌ వచ్చేశాడు

Published on Wed, 08/06/2025 - 21:20

పాకిస్తాన్‌తో స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడా త‌మ జ‌ట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు బుధ‌వారం ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టు కెప్టెన్‌గా షాయ్ హోప్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

అదేవిధంగా విధ్వంస‌క‌ర ఆల్‌రౌండ‌ర్ రొమారియో షెప‌ర్డ్ తిరిగి వ‌న్డే జ‌ట్టులోకి వ‌చ్చాడు. షెప‌ర్డ్ ఇంతకుముందు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు.

మ‌రోవైపు పాక్‌తో సిరీస్‌కు ఫాస్ట్ బౌల‌ర్ అల్జారి జోసెఫ్‌, ఆల్‌రౌండ‌ర్‌ జాస‌న్ హోల్డ‌ర్‌కు వ‌ర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా సెల‌క్ట‌ర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇంత‌కుముందు టీ20 సిరీస్‌కు కూడా జోసెఫ్‌ దూర‌మ‌య్యాడు. 

ఈ జ‌ట్టులో రోస్టన్ చేజ్, బ్రాండన్ కింగ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, లూయిస్ వంటి సీనియ‌ర్ ఆట‌గాళ్లు ఉన్నారు. కాగా ఈ మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ఆగస్టు 8 నుంచి 12 మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. మొత్తం మూడు మ్యాచ్‌లకు ట్రినిడాడ్‌లోని తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియం ఆతిథ్యమివ్వ‌నుంది.

కాగా అంత‌కుముందు పాక్‌తో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో విండీస్ కోల్పోయింది. ఈ క్ర‌మంలో వ‌న్డే సిరీస్‌ను ఎలా అయినా సొంతం చేసుకోవాల‌ని క‌రేబియ‌న్ జ‌ట్టు ప‌ట్టుద‌ల‌తో ఉంది.
పాక్‌తో వ‌న్డే సిరీస్‌కు విండీస్ జ‌ట్టు
షాయ్ హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, జెడియా బ్లేడ్స్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్ మరియు రొమారియో షెపర్డ్.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)