Breaking News

రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే అదుర్స్‌.. షాహీన్‌ షా అఫ్రిది అరుదైన రికార్డు

Published on Sun, 07/16/2023 - 14:26

టెస్టుల్లో పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్‌ నిషాన్ మదుష్కను ఔట్‌ చేసిన అఫ్రిది.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు. ఈ అరుదైన మైలురాయిని అందుకున్న 18వ పాక్ బౌలర్‌గా షాహీన్‌ షా అఫ్రిది నిలిచాడు.

అఫ్రిది ఈ అరుదైన ఫీట్‌ను కేవలం 26వ టెస్టు మ్యాచ్‌లోనే అందుకున్నాడు. అదే విధంగా కేవలం 23 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన మూడో పాక్ ఫాస్ట్ బౌలర్‌గా అఫ్రిది రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో పాక్‌ దిగ్గజ బౌలర్లు సీం అక్రమ్, వకార్ యూనిస్‌లు ఉన్నారు. ఇక దాదాపు ఏడాది తర్వాత టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన అఫ్రిది.. తన తొలి మ్యాచ్‌లోనే నిప్పులు చేరుగుతున్నాడు.

అదిలోనే మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీశాడు. కుశాల్‌ మెండిస్‌, కరుణరత్నే, మధుష్క వికెట్లను అఫ్రిది పడగొట్టాడు. అఫ్రిది కెరీర్‌లో 4 ఫైవ్‌ వికెట్ల హాల్స్‌, ఒక 10 వికెట్ల హాల్‌ ఉన్నాయి. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో మథ్యూస్‌(34), ధనుంజయ డిసిల్వా(23) పరుగులతో ఉన్నారు.
చదవండి: Ind Vs Wi: ఇంత తక్కువ ప్రైజ్‌మనీ ఎందుకివ్వడం.. మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)