Breaking News

రసవత్తరంగా యాషెస్‌ తొలి టెస్టు.. స్టేడియంలో కన్పించిన షాహీన్‌ అఫ్రిది! ఫోటో వైరల్‌

Published on Tue, 06/20/2023 - 11:34

యాడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య జరగుతున్న యాషెస్‌ తొలి టెస్టు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో బోణీ కొట్టేందుకు ఆఖరి రోజు ఆసీస్‌కు మరో 174 పరుగులు అవసరమవ్వగా.. ఇంగ్లండ్‌కు మరో 7 వికెట్లు కావాలి. 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆటముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. క్రీజులో క్రీజులో ఉస్మాన్‌ ఖ్వాజా(34), స్కాట్‌ బోలాండ్‌(13) నాటౌట్‌గా ఉన్నారు.

స్టేడియంలో కన్పించిన షాహీన్‌
ఇక రసవత్తరంగా సాగుతున్న ఈ మ్యాచ్‌ను చూసేందుకు పాకిస్తాన్‌  స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియంకు వచ్చాడు. నాలుగో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 33 ఓవర్‌లో షాహీన్‌ కెమరా కంట పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అఫ్రిది ప్రస్తుతం ఇంగ్లండ్‌ టీ20 బ్లాస్ట్‌ టోర్నీలో బీజీగా ఉన్నాడు.

ఈ టోర్నీలో నాటింగ్‌హామ్‌షైర్‌ అఫ్రిది ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌తో రెడ్‌బాల్‌ క్రికెట్‌లో అఫ్రిది పునరాగమనం చేయనున్నాడు. గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి టెస్టు జట్టుకు అఫ్రిది దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అఫ్రిదికి చోటు దక్కింది.
చదవండి: #Ashes2023: ఇదేమి యార్కర్‌రా బాబు.. దెబ్బకు బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)