Breaking News

సాయికార్తీక్‌ ఖాతాలో ఏడో డబుల్స్‌ టైటిల్‌

Published on Sun, 09/15/2024 - 09:03

సాక్షి, హైదరాబాద్‌: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా ఐదు టోర్నమెంట్‌లలో ఫైనల్‌ చేరి... రన్నరప్‌ ట్రోఫీలతోనే సరిపెట్టుకున్న హైదరాబాద్‌ యువ టెన్నిస్‌ ప్లేయర్‌ గంటా సాయికార్తీక్‌ రెడ్డి ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో విజయవంతమయ్యాడు. ఈ ఏడాది తన ఖాతాలో తొలి అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబుల్స్‌ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఇండోనేసియా ఆ«దీనంలోని బాలి ద్వీపంలో జరిగిన ఐటీఎఫ్‌ ఎం25 టోరీ్నలో సాయికార్తీక్‌ రెడ్డి (భారత్‌)–బొగ్డాన్‌ బొబ్రోవ్‌ (రష్యా) జోడీ డబుల్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది. 

ఫైనల్లో సాయికార్తీక్‌–బొగ్డాన్‌ ద్వయం 6–2, 6–4తో మాథ్యూ స్కాగ్లియా (ఫ్రాన్స్‌)–జాకుబ్‌ వోచిక్‌ (అమెరికా) జంటపై గెలిచింది. సాయికార్తీక్‌ »ొగ్డాన్‌ జోడీకి 1,550 డాలర్ల (రూ. 1 లక్ష 30 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఓవరాల్‌గా సాయికార్తీక్‌ కెరీర్‌లో ఇది ఏడో డబుల్స్‌ టైటిల్‌కాగా, ఈ ఏడాది తొలి డబుల్స్‌ టైటిల్‌. 24 ఏళ్ల సాయికార్తీక్‌ 2023లో నాలుగు డబుల్స్‌ టైటిల్స్‌ను, 2022లో రెండు డబుల్స్‌ టైటిల్స్‌ను సాధించాడు. ఈ ఏడాది సాయికార్తీక్‌ మొత్తం 22 ఐటీఎఫ్‌ టోరీ్నలలో పాల్గొన్నాడు. ఐదు టోర్నీల్లో డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచి, ఒక టోరీ్నలో టైటిల్‌ గెలిచాడు.    

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)